అక్షరటుడే, హైదరాబాద్ : Vidya Laxmi | ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత చదువులకు దూరమవుతున్న పేద విద్యార్థులను ఆదుకోవడానికి, ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి విద్యాలక్ష్మి పథకాన్ని (PM Vidya Lakshmi Yojana) ప్రారంభించింది. సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా మందికి తెలియని ఈ పథకం, విద్యార్థులకు ఎలాంటి హామీ పత్రం అవసరం లేకుండానే బ్యాంకుల నుండి విద్యా రుణం పొందే సువర్ణావకాశాన్ని కల్పిస్తోంది. ఈ రుణం ద్వారా ట్యూషన్ ఫీజు(Tutuion Fee)తో పాటు వసతి, రవాణా వంటి అన్ని ఖర్చులనూ పొందవచ్చు.
Vidya Laxmi | పీఎం విద్యాలక్ష్మి పథకం ముఖ్య ఉద్దేశం:
ఈ పథకం ముఖ్య లక్ష్యం పేద విద్యార్థులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం అవసరమైన ఆర్థిక సాయాన్ని అందించడం.
రుణం సులభం : విద్యార్థులు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, సులభంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సౌలభ్యాన్ని ఈ పథకం కల్పిస్తుంది.
హామీ పత్రం మినహాయింపు : ఇది అతిపెద్ద ప్రయోజనం. ఎలాంటి హామీ పత్రం లేకుండానే బ్యాంకుల నుంచి రుణం పొందవచ్చు.
ఖర్చులు కవరేజ్ : చదువుకు అయ్యే ఖర్చులైన ట్యూషన్ రుసుముతో పాటు, వసతి, రవాణా వంటి ఇతర ఖర్చులను కూడా రుణం కింద పొందవచ్చు.
ఛార్జీలు లేవు : ఈ రుణం పొందడానికి ఎలాంటి దరఖాస్తు లేదా ప్రాసెసింగ్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.
Vidya Laxmi | రుణ మంజూరు, దరఖాస్తు విధానం:
విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకునే విధానం చాలా సులభం.
దరఖాస్తు విధానం : రుణం అవసరమైన విద్యార్థులు VIDYALAKSHMI.CO.IN వెబ్‌సైట్‌లోకి వెళ్లి వివరాలను నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తరువాత సాధారణ విద్యా రుణం దరఖాస్తు ఫారం (CELAF) పూర్తి చేసి, అవసరమైన ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాలి.
మంజూరు గడువు : రుణం కోసం దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే తక్కువ వడ్డీతో రుణాన్ని మంజూరు చేస్తారు.
దరఖాస్తు స్థితి : దరఖాస్తు స్థితి (స్టేటస్) ఎప్పటికప్పుడు పోర్టల్‌లోని డాష్‌బోర్డులో నవీకరించబడుతుంది. అవసరమైన పత్రాలు జత చేయకపోతే, దరఖాస్తు పెండింగ్‌లో (ఆన్‌హోల్డ్) ఉంటుందని విద్యార్థులు తెలుసుకోవచ్చు.
అర్హతలు , రుణ కేటగిరీలు:
అర్హతా నిబంధనలు:
వార్షికాదాయం : విద్యార్థి కుటుంబ వార్షికాదాయం రూ. 4 లక్షలలోపు ఉండాలి.
కోర్సులు : డిగ్రీ, ఇంజినీరింగ్, వైద్యం, వృత్తి విద్యా కోర్సులు, ప్రొఫెషనల్ కోర్సులతో పాటు విదేశాల్లో ఉన్నత విద్య చదివే విద్యార్థులు కూడా అర్హులే.
దరఖాస్తు పరిమితి : ఒక్కో విద్యార్థి కేవలం ఒకే దరఖాస్తు చేసుకోవాలి.
రుణ పరిమితులు (3 విభాగాలు):
అర్హతలు ఉన్న విద్యార్థులకు అవసరాన్ని బట్టి రుణం మూడు రకాలుగా మంజూరు చేస్తారు:
మొదటి విభాగం : రూ. 4 లక్షలలోపు రుణం.
రెండో విభాగం : రూ. 4 లక్షల నుంచి రూ. 7.5 లక్షల వరకు రుణం.
మూడో విభాగం : రూ. 7.5 లక్షలకు పైగా రుణం.
Vidya Laxmi | అవసరమైన పత్రాలు:
దరఖాస్తుతో పాటు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ మార్కుల జాబితాలు, చివరి కోర్సు ఉత్తీర్ణతా పత్రం, తదుపరి కోర్సు అడ్మిషన్ పత్రాలు , ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి. ఈ రుణం కోసం మార్కులు లేదా శాతం వివరాలు అవసరం లేదు.


