అక్షరటుడే, హైదరాబాద్ : Cleaning Hacks | వాషింగ్ మెషిన్లో బట్టలు వేసినా, అవి సరిగ్గా ఉతకక, మరకలు అలాగే ఉండిపోతాయి. అయితే యంత్రం పాడైందని కొత్తది మార్చలనుకుంటారు.దానిని కొనే ముందు ఈ చిన్న చిట్కా ప్రయత్నించండి. కేవలం ఒక చిన్న ట్రిక్ మీ బట్టలను కొత్తవాటిలా మెరిపిస్తాయి.
లింట్ ఫిల్టర్ శుభ్రం చేయడం:
వాషింగ్ మెషిన్ (Washing Machine)లో ఉండే లింట్ ఫిల్టర్ బట్టల నుంచి వెంట్రుకలు, దారాలు, ధూళిని సేకరిస్తుంది.ఈ ఫిల్టర్‌ను ప్రతి 10-15 సార్లు ఉతికిన తర్వాత లేదా కనీసం రెండు వారాలకొకసారి శుభ్రమైన నీటితో కడగాలి.ఫిల్టర్ మురికిగా ఉంటే నీటి ప్రవాహం తగ్గి, బట్టలు సరిగా ఉతకవు.
డిటర్జెంట్ ట్రే, డ్రమ్‌ను శుభ్రం చేయడం:
ఎక్కువ డిటర్జెంట్ (Detergent) వాడితే అది యంత్రం లోపల, పైపుల్లో పేరుకుపోయి మురికి వాసన, నీటి ప్రవాహం తగ్గడానికి కారణమవుతుంది.దీనిని నివారించడానికి, నెలకు ఒకసారి ఖాళీగా ఉన్న యంత్రాన్ని ‘టబ్ క్లీన్ మోడ్’లో వెచ్చని నీళ్లు, వెనిగర్‌తో నడపించాలి. ఇది పేరుకుపోయిన మురికిని, వాసనను తొలగిస్తుంది.
సరైన పరిమాణంలో బట్టలు వేయడం:
ఒకేసారి ఎక్కువ బట్టలు వేస్తే డిటర్జెంట్, నీరు అన్నింటికీ సరిగా అందవు, దానివల్ల బట్టలు మురికిగా మిగిలిపోతాయి.దీనితో పాటు మోటారుపై ఒత్తిడి పడి యంత్రం పాడయ్యే అవకాశం ఉంటుంది.ఎల్లప్పుడూ మెషిన్ సామర్థ్యానికి తగినంత బట్టలు మాత్రమే వేయాలి.
డోర్ సీల్స్ (రబ్బరు) శుభ్రత:
ప్రతి వారం డ్రమ్, డోర్ రబ్బరు సీల్, డిటర్జెంట్ ట్రేలను తడి గుడ్డతో తుడవాలి.రబ్బరు సీల్స్ (Rubber Seals)లో తేమ వల్ల ఫంగస్ (మోల్డ్) పేరుకుపోయే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్త వహించాలి.బట్టలు తీసిన తర్వాత, యంత్రం లోపలి భాగం ఆరిపోయేలా కొంతసేపు తలుపు తెరిచి ఉంచండి. ఇది దుర్వాసన రాకుండా చేస్తుంది.
ఈ సాధారణ శుభ్రత చిట్కాలు పాటించడం ద్వారా మీ వాషింగ్ మెషిన్ ఎక్కువ కాలం మన్నికగా ఉండి, బట్టలు శుభ్రంగా, మంచి వాసనతో ఉంటాయి. బట్టలు శుభ్రం చేయడంతో పాటు, యంత్రాన్ని కూడా శుభ్రం చేయడం చాలా అవసరం.


