అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sri Lanka Defeat | టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 దశలో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియం Premadasa Stadium వేదికగా జరిగిన కీలక పోరులో శ్రీలంక జట్టుకు (Sri Lanka Defeat) చేదు అనుభవం ఎదురైంది.
న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 61 పరుగుల తేడాతో ఓడిపోవడమే కాకుండా, టోర్నీ చరిత్రలోనే అత్యల్ప పవర్‌ప్లే స్కోరును నమోదు చేసి అవమానకర రికార్డును తన ఖాతాలో వేసుకుంది. టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ (New Zealand) ఆరంభంలో జాగ్రత్తగా ఆడింది. ఒక దశలో 75 పరుగులకే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి భారీ స్కోరు దిశగా సాగింది. అయితే లంక బౌలర్లు పుంజుకుని 9 పరుగుల వ్యవధిలో 4 కీలక వికెట్లు పడగొట్టడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. 84 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన కివీస్ కష్టాల్లో పడింది.
Sri Lanka Defeat | అద్భుతమైన భాగస్వామ్యం..
ఇలాంటి పరిస్థితుల్లో కెప్టెన్ మిచెల్ సాంట్నర్ Santner , కోల్ మెక్కాన్చీలు అద్భుత భాగస్వామ్యంతో జట్టును గట్టెక్కించారు. ఏడో వికెట్‌కు 47 బంతుల్లో 84 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పి, జట్టు స్కోరును 20 ఓవర్లలో 168/7కు చేర్చారు. ఈ భాగస్వామ్యమే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ప్రారంభంలోనే కివీస్ బౌలర్లు గట్టి షాక్ ఇచ్చారు. పవర్‌ప్లే 6 ఓవర్లలో కేవలం 20 పరుగులు మాత్రమే చేసి 2 వికెట్లు కోల్పోయిన లంక, టీ20 ప్రపంచకప్ చరిత్రలో తన అత్యల్ప పవర్‌ప్లే స్కోరును నమోదు చేసింది. పెద్ద లక్ష్యాన్ని ఛేదించాల్సిన సందర్భంలో ధాటిగా ఆడాల్సింది పోయి, జాగ్రత్తగా ఆడుతూ వికెట్లు కోల్పోవడం జట్టుకు చేదు అనుభవాన్ని మిగిల్చింది.

61 పరుగుల తేడాతో ఓటమి
చివరికి శ్రీలంక 20 ఓవర్లలో 107/8 పరుగులకే పరిమితమై 61 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కామిందు మెండిస్ (31) మినహా మిగతా బ్యాటర్లు ఎవ్వరూ రాణించలేకపోయారు. కివీస్ New Zealand తరఫున స్పిన్నర్ రచిన్ రవీంద్ర నాలుగు వికెట్లు తీసి లంక పతనానికి ప్రధాన కారణమయ్యాడు.
నిష్క్రమించిన శ్రీలంక
ఈ ఓటమితో శ్రీలంక సెమీఫైనల్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. మరోవైపు న్యూజిలాండ్ తన చివరి మ్యాచ్‌లో గెలిస్తే నేరుగా సెమీస్‌కు చేరుకునే స్థితిలో ఉంది. మొత్తం మీద కొలంబో వేదికగా లంక జట్టుకు ఇది మరచిపోలేని చేదు జ్ఞాపకంగా మిగిలింది.
ఇది కూడా చదవండి..: India Semi final Chances | జింబాబ్వే చిత్తుగా ఓడడంతో ప్రమాదంలో టీమిండియా.. భారత్ సెమీస్ ఆశలు క్లిష్టం.. NRR కీలకం

