Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Arudra Nakshatra Significance | ఆ‘రుద్ర’ నక్షత్రాన.. శివాభిషేకంతో విశేష ఫలాలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

భక్తి - Arudra Nakshatra Significance | ఆ‘రుద్ర’ నక్షత్రాన.. శివాభిషేకంతో విశేష ఫలాలు

భక్తి

Arudra Nakshatra Significance | ఆ‘రుద్ర’ నక్షత్రాన.. శివాభిషేకంతో విశేష ఫలాలు

హిందూ క్యాలెండర్ ప్రకారం 27 నక్షత్రాలున్నాయి. ఇందులో ఆరవది ఆరుద్ర. ఈ నక్షత్రాన్ని ఆది దేవుడైన పరమశివుడి జన్మనక్షత్రంగా భావిస్తారు.

admin
Last updated: ఫిబ్రవరి 26, 2026 6:19 సా.
admin
4 వారాలు ago
Share
Arudra Nakshatra Significance

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Arudra Nakshatra Significance | హిందూ క్యాలెండర్ ప్రకారం 27 నక్షత్రాలున్నాయి. ఇందులో ఆరవది ఆరుద్ర. ఈ నక్షత్రాన్ని ఆది దేవుడైన పరమశివుడి జన్మనక్షత్రంగా భావిస్తారు. శుక్రవారం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శివాభిషేకం చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయని ఆధ్యాత్మిక వేత్తలు పేర్కొంటున్నారు.

Contents
  • Arudra Nakshatra Significance | పురాణ గాధ..
      • Arudra Nakshatra Significance | ఏం చేయాలంటే..

లయకారుడైన శివుడు ఆది(మొదలు), అనాది (అంతం) లేనివాడు. ఆయన కాలానికి అతీతుడు.. స్వయంభువు.. సృష్టికార్యం మొదలవకముందే ఉన్నందున ఆయనను ఆది పురుషుడిగా పేర్కొంటారు. జనన మరణాలు లేని ఆ నీలకంఠుదు.. సృష్టి అంతమైపోయినా అలాగే ఉంటాడన్నది భక్తుల నమ్మకం. అయితే సమస్త సృష్టికి మూలకారకుడైన ఆదిశంకరుడిని భక్తితో ఆరాధించడానికి ఆయనకు జన్మనక్షత్రంగా ఆరుద్రను స్వీకరించారు. ప్రధానంగా దక్షిణ భారతంలో రుద్ర రూపాన్ని సూచించేలా ఉన్నందున ఆరుద్రను శివుడి జన్మ నక్షత్రంగా భావిస్తారు.

Arudra Nakshatra Significance | పురాణ గాధ..

సృష్టి ఆరంభంలో అసమతుల్యత, అహంకారం పెరిగిన సమయంలో పరమశివుడు తీవ్రమైన, భయంకరమైన రుద్ర రూపంలో అవతరించాడు. ఆ రుద్ర రూప ఆవిర్భావ సమయంలో ఆకాశంలో ఆరుద్ర నక్షత్రం ఉంది. దీంతో ఆ నక్షత్రాన్ని శివుని జన్మ స్థానంగా లేదా ఆవిర్భావ స్థానంగా భక్తులు నమ్ముతున్నారు. శివుడు ఆది, అనాది లేనివాడైనా.. రుద్ర రూపాన్ని దాల్చిన రోజున ఉన్న ఆరుద్ర నక్షత్రాన్ని ఆయన జన్మ నక్షత్రంగా భావిస్తున్నారు. ఈ నక్షత్రానికి రుద్రుడే అధిదేవత.

Arudra Nakshatra Significance | ఏం చేయాలంటే..

ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజు (ముఖ్యంగా పౌర్ణమితో కలిసినప్పుడు)ను శివ ముక్కోటిగా పేర్కొంటారు. దీనిని కోటి సోమవారాల ఉపాసన పుణ్యం ఇచ్చే రోజుగా భక్తులు నమ్ముతారు.
ఆరుద్ర నక్షత్రం రోజున ఉపవాసం ఉండి, శివపూజ చేయాలి. నటరాజస్వామిని దర్శించుకోవాలి. ఆ రోజు శివాలయాల్లో ఆర్ద్రోత్సవం(ఆరుద్ర ఉత్సవం)ను ఘనంగా జరుపుతారు. ప్రధానంగా తమిళనాడులో తిరువాతిరై ఉత్సవం జరుపుకుంటారు. పంచామృతాభిషేకం, బిల్వపత్రాలతో పూజలు చేస్తారు. శివాష్టకం, బిల్వాష్టకం, ఓం నమః శివాయ పఠిస్తారు. ఆయా పూజలత సమస్యలు తీరుతాయని, మానసిక శాంతి, ఆధ్యాత్మిక ఉన్నతి లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ప్రతి నెలా వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున శివపూజ లేదా శివునికి అభిషేకం చేయించిన వారికి నవగ్రహ దోషాలు తొలగిపోతాయని, అనుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.

ఇది కూడా చదవండి..: Kavitha New Party | గద్వాల నుంచే కొత్త పార్టీ..: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

Feb 27 Horoscope | వైవాహిక జీవితం ఎంతో మధురం.. నేడు ఈ రాశుల వారికి మరిచిపోలేని రోజు!
Ugadi Celebrations Indur | ఇందూరులో కాషాయ ధ్వజావిష్కరణ.. ఘనంగా ఉగాది ఉత్సవాలు
March 08 Horoscope | ఆకట్టుకునే స్వభావం.. ఈ రాశుల వారికే సొంతం!
March 10 Horoscope | ఈ రాశుల వారికి ఆఫీసులో పెరగనున్న గౌరవం.. శత్రువులు కూడా మిత్రులుగా మారడం ఖాయం!
Tirumala Devotee Rush | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ కంపార్టుమెంట్లు ఫుల్​..
TAGGED:Ardra StarArudra NakshatraBilva PatraHindu AstrologyLord ShivaPanchamruta AbhishekamRudraShiva AbhishekamShiva PujaThiruvathirai Festival
Share This Article
Facebook Whatsapp Whatsapp
Previous Article Stock Market Volatility Stock Market Volatility | ప్రారంభ లాభాలు ఆవిరి.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు
Next Article Ponguleti vs KTR Ponguleti vs KTR | కేటీఆర్​, హరీశ్​రావుపై పొంగులేటి ఆగ్రహం
3 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?