అక్షరటుడే, వెబ్డెస్క్ : Employee Pending Bills Release | ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ బిల్లుల కోసం బిల్లులు విడుదల చేసింది. ప్రతి నెల ఉద్యోగులకు ప్రభుత్వం పెండింగ్ బకాయిలు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.
Employee Pending Bills Release | డిప్యూటీ సీఎం ఆదేశాలతో..
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఆదేశాల మేరకు ఉద్యోగుల పెండింగ్ బిల్లులు రూ. 745 కోట్లు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కొన్నేళ్లుగా ఉద్యోగులకు బకాయిలు పేరుకుపోయాయి. దీంతో ఉద్యోగ సంఘాలు నాయకులు గతంలో ఆందోళనలు చేపట్టారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చించారు. ప్రతి నెల కొద్ది కొద్దిగా బకాయిలు చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు. ఈ మేరకు జూన్ నుంచి పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ. 700 కోట్లకు తక్కువ కాకుండా మంజూరు చేస్తోంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి నెలకు సంబంధించి రూ.745 కోట్లను తాజాగా విడుదల చేశారు.
Employee Pending Bills Release | ఉద్యోగుల హర్షం
ప్రతి నెలా పెండింగ్ బిల్లులు కోసం నిధులు విడుదల చేస్తుండటంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జూన్లో రూ.183 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం, తర్వాత నుంచి ప్రతి నెలా రూ.700 కోట్లపైనే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తోంది. నవంబర్లో రూ.707 కోట్లు, డిసెంబర్లో రూ.713 కోట్లు, జనవరిలో రూ.720 కోట్లు విడుదల చేసింది. సరెండర్ లీవుల ఎన్‌క్యాష్‌మెంట్, గ్రాట్యుటీ, GPF (General Provident Fund), సరెండర్ లీవ్ అడ్వాన్సుల కోసం ఈ నిధులు కేటాయించనున్నారు.
ఇది కూడా చదవండి..: Telangana Education Commission | పని చేస్తేనే పదోన్నతులు : తెలంగాణ విద్యా కమిషన్


This budget for whos, please tell us details sir
రిటైర్మెంట్ తీసుకున్న ప్రతి ఉద్యోగికి వెంటనే అదే రోజు ఆయనకు, ఆమెకు రావాల్సిన బెనిఫిట్స్ ఆయనకు లేదా ఆమెకు వెంటనే చెల్లుంచాలి, నెలల కొద్దీ పెండిగులు పెట్ట వొద్దు
రిటైర్మెంట్ తీసుకున్న ప్రతి ఉద్యోగికి వెంటనే అదే రోజు ఆయనకు, ఆమెకు రావాల్సిన బెనిఫిట్స్ ఆయనకు లేదా ఆమెకు వెంటనే చెల్లుంచాలి, నెలల కొద్దీ పెండిగులు పెట్ట వొద్దు.
Yedaina emedently New pumpandi