అక్షరటుడే, కామారెడ్డి: National Education Policy 2020 | విద్యార్థులు కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవడం అత్యవసరమని కళాశాల విద్య జాయింట్ డైరెక్టర్ డాక్టర్ డీఎస్ఆర్ రాజేందర్ సింగ్ అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (Government Degree College) శుక్రవారం నిర్వహించిన జాతీయ సెమినార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
National Education Policy 2020 | రాజనీతి శాస్త్రంలో..
‘ది నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఎన్ఈపీ–2020- ఏ ట్రాన్స్‌ఫర్మేటివ్ షిఫ్ట్ ఇన్ ఇండియన్ ఎడ్యుకేషన్’ (NEP 2020 Seminar) అనే అంశంపై రాజనీతి శాస్త్రంలో రెండు రోజుల జాతీయ సెమినార్ (Political Science Seminar) అట్టహాసంగా ప్రారంభమైంది. జ్యోతి ప్రజ్వలన, విద్యార్థినుల స్వాగత నృత్యం, సెమినార్ సావనీర్ ఆవిష్కరణతో కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.
నూతన విద్యావిధానం..
ఈ సందర్భంగా డాక్టర్ డీఎస్ఆర్ రాజేందర్ సింగ్ మాట్లాడుతూ.. నూతన విద్యావిధానం మానవాళి అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. విద్యార్థులు కొత్త నైపుణ్యాలను (Skill Development)పెంపొందించుకోవడం అత్యవసరమని సూచించారు. అనంతరం మధ్యాహ్నం జరిగిన నాలుగు టెక్నికల్ సెషన్లలో వివిధ విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు తమ పరిశోధన పత్రాలను సమర్పించారు.
అతిథులకు ఘన సత్కారం
అనంతరం సెమినార్‌కు (National Education Policy 2020) విచ్చేసిన అతిథులను కళాశాల తరపున శాలువా, జ్ఞాపిక, పూల మొక్కలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల (degree college) ప్రిన్సిపాల్ కె.విజయ్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ కిష్టయ్య, ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ నర్సింహారెడ్డి, రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ యాదగిరి, తమిళనాడు వర్సిటీ ప్రొఫెసర్ భూక్య వీరభద్రం, కేంద్రియ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కృష్ణారెడ్డి, గుజరాత్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జగన్నాథం, వివిధ కళాశాలల అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Kamareddy college land controversy : ఆస్తుల దుమారం.. కాలేజీ చుట్టూ వివాదం

