అక్షరటుడే, ఇందూరు: Collector Ila Tripathi comments | ఎన్ని ఇబ్బందులెదురైనా విద్యార్థులు చదువును (Girls Education) కొనసాగించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Ila Tripathi) అన్నారు. జిల్లా కేంద్రంలోని కోటగల్లి బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రోటరీ క్లబ్ (Rotary Club Initiative) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(state bank of india) సౌజన్యంతో శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Collector Ila Tripathi comments | ఆందోళనకు గురికావొద్దు..
ఈ సందర్భంగా కలెక్టర్ (Collector Ila Tripathi comments) మాట్లాడుతూ.. ప్యాడ్లను ఏడాది పాటు పునర్వినియోగం చేసుకోవచ్చని కలెక్టర్ అన్నారు. వాడిన అనంతరం శుభ్రపర్చుకుని ఆరబెట్టుకోవాలని సూచించారు. నెలసరి విషయంలో బాలికలు ఆందోళనకు లోను కావద్దని.. అది ప్రకృతి సహజంగా జరిగే పరిణామమన్నారు. బాలికలు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యం, పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
Collector Ila Tripathi comments | జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి..
జంక్ ఫుడ్‌కు విద్యార్థులు దూరంగా ఉండాలని, బలమైన ఆహారాన్ని తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. విద్యతోనే సమాజంలో (Telangana Education) ఉన్నత స్థానం గౌరవం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎస్బీఐ రీజినల్ మేనేజర్ మహేశ్వరం, లీడ్ బ్యాంక్ మేనేజర్ సునీల్, పాఠశాల హెచ్ఎం సాయారెడ్డి, రోటరీ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Nizamabad Urban Development | నియోజకవర్గ అభివృద్ధిపై పురోగతి సాధించాలి: ఎమ్మెల్యే ధన్పాల్

