Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hyderabad Traffic Relief | ట్రాఫిక్​ రద్దీ నివారణకు చర్యలు : సీపీ సజ్జనార్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Hyderabad Traffic Relief | ట్రాఫిక్​ రద్దీ నివారణకు చర్యలు : సీపీ సజ్జనార్​

హైదరాబాద్

Hyderabad Traffic Relief | ట్రాఫిక్​ రద్దీ నివారణకు చర్యలు : సీపీ సజ్జనార్​

హైదరాబాద్​లో ట్రాఫిక్​ రద్దీని నివారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు సీపీ సజ్జనార్​ తెలిపారు. దీనికోసం ఫ్లై ఓవర్లు, అండర్​పాస్​లు నిర్మిస్తున్నట్లు చెప్పారు.

Srinivas kolluri
Last updated: ఫిబ్రవరి 27, 2026 8:55 సా.
Srinivas Kolluri
4 వారాలు ago
Share
Hyderabad Traffic Relief

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Traffic Relief | హైదరాబాద్​ నగరంలో ట్రాఫిక్​ రద్దీని నివారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు సీపీ సజ్జనార్ (CP Sajjanar)​ తెలిపారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ‘హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ (హెచ్-సిటీ) ప్రాజెక్టు పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

Contents
  • Hyderabad Traffic Relief | సిగ్నల్​ ఫ్రీగా..
    • Hyderabad Traffic Relief | రాత్రిపూట..
      • ట్రాఫిక్​ ఆంక్షలు

బంజారాహిల్స్ రోడ్ నంబ‌ర్ 2లోని ముగ్ధ జంక్ష‌న్ వ‌ద్ద నిర్మిస్తున్న స్టీల్ ఫ్లైఓవ‌ర్ పనులను శుక్ర‌వారం సీపీ సజ్జనార్​ పరిశీలించారు. జీహెచ్ఎంసీ, మేఘా ఇంజినీరింగ్ సంస్థ ప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఆయన నిర్మాణ ప్రాంతాన్ని పర్యవేక్షించారు. నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని రహదారుల వ్యవస్థను తీసుకురావడమే లక్ష్యంగా ఈ పనులు జరుగుతున్నాయన్నారు.

Hyderabad Traffic Relief | సిగ్నల్​ ఫ్రీగా..

కేబీఆర్ పార్క్ చుట్టూ సిగ్నల్ ఫ్రీ (Hyderabad Traffic Relief) రాకపోకల కోసం రాబోయే రెండేళ్లలో మొత్తం ఏడు ఫ్లైఓవర్లు, అండర్ పాస్​లను నిర్మించనున్నట్లు సీపీ తెలిపారు. జీహెచ్ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం సమన్వయంతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిర్మాణ పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. శుక్రవారం రాత్రి నుంచే ముగ్ధ జంక్షన్ నుంచి కేబీఆర్ పార్క్ వైపు వెళ్లే మార్గంలో ఆరు పిల్లర్ల నిర్మాణ పనులకు ప్రారంభం అవుతాయన్నారు.

Hyderabad Traffic Relief | రాత్రిపూట..

పగటి పూట ట్రాఫిక్​కు అంతరాయం కలగకుండా పనులు రాత్రివేళల్లోనే చేపడుతారని పోలీస్​ బాస్​ తెలిపారు. పునాది పనులు పూర్తయ్యే వరకు మాత్రమే రాకపోకలకు కొంతమేర అసౌకర్యం ఉంటుందన్నారు. ఆ తర్వాత వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కేబీఆర్ పార్క్ (KBR Park) పరిసరాలు పూర్తిగా సిగ్నల్ ఫ్రీ జంక్షన్లుగా మారుతాయని చెప్పారు.

ట్రాఫిక్​ ఆంక్షలు

నిర్మాణ పనుల నేపథ్యంలో ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సీపీ తెలిపారు. ప్రజలు రద్దీని నివారించేందుకు వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్​పోర్ట్​ను వినియోగించుకోవాల‌న్నారు. పనులు ప్రారంభమైన రెండు, మూడు రోజుల అనంతరం.. అవసరమైన మార్గాల్లో మార్పులు చేస్తూ ఎప్పటికప్పుడు తాజా ట్రాఫిక్ అడ్వైజరీలు జారీ చేస్తామని వెల్లడించారు.

ఇది కూడా చదవండి..: KTR Slams Congress | అవినీతి, అరాచకమే కాంగ్రెస్ పాలన : కేటీఆర్

Shamshabad Airport | శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టివేత
Adulterated Ginger Garlic Paste | భారీగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్​ స్వాధీనం​.. ఇద్దరి అరెస్ట్​
LB Nagar Car Accident | ఎల్​బీ నగర్​లో కారు దగ్ధం.. అతివేగంతో ప్రమాదం
BMW Car Accident | బీఎండబ్ల్యూ కారు బీభత్సం
Samsung Mobile Fraud | తక్కువ ధరకే శాంసంగ్ ఫోన్ అంటూ మోసం.. పార్శిల్ విప్పి చూశాక షాక్‌
TAGGED:Banjara Hills TrafficCP SajjanarGHMC ProjectsH City ProjectHyderabad InfrastructureHyderabad Traffic ReliefHyderabad Traffic UpdateKBR Park Flyover
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Collector Ila Tripathi comments | Collector Ila Tripathi comments | ఎన్ని ఇబ్బందులెదురైనా చదువును కొనసాగించాలి..: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
Next Article Manala Mohan Reddy | Manala Mohan Reddy | తండాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలి : మానాల మోహన్​రెడ్డి
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?