అక్షరటుడే, ఎల్లారెడ్డి: RDO Parthasarathi Reddy | ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజన్లో ఆర్డీవో పార్థసింహారెడ్డి సేవలు అభినందనీయమని జాయింట్ కలెక్టర్ విక్టర్, సబ్ కలెక్టర్ కిరణ్మయి పేర్కొన్నారు. ఎల్లారెడ్డి ఆర్డీవోగా (Yellareddy News) బాధ్యతలు నిర్వహించి బదిలీపై వెళ్తున్న ఆయనకు జిల్లా అధికారులు ఘనంగా వీడ్కోలు (Revenue Division Farewell) పలికారు.
RDO Parthasarathi Reddy | ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజన్లో..
ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజన్లో ఆయన పనిచేసిన ఏడు నెలల కాలంలోనే ప్రజలు, అధికారుల మన్ననలు పొందారని జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్ అన్నారు. అనంతరం డీఎస్పీ శ్రీనివాసరావు, డీఏవో అనిల్ కుమార్, తహశీల్దార్ ప్రేమ్, మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ రజిత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. డివిజన్లో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, చెరువుల మరమ్మతులు చేయించడంలో ఆర్డీవో ఎంతో చొరవ చూపించారన్నారు. పోచారం ప్రాజెక్ట్ (Pocharam Project Support) కొట్టుకుపోతుందేమోనని ప్రజలు భయపడితే అందరికీ ధైర్యం చెబుతూ ముందుకు కదిలారని పేర్కొన్నారు. నాయకులు, అధికారులు, ప్రజలతో మమేకమై వర్షంలో కట్టపూడిక పనులను చేపట్టి ప్రాజెక్ట్‌ను నిలబెట్టడంలో కృషి చేశారన్నారు.
RDO Parthasarathi Reddy | ఎంతటి విపత్తునైనా..
ఎంతటి విపత్తులోనైనా అంకితభావంతో పనిచేస్తూ ఆర్డీవో అందరికీ అప్తుడయ్యారని అధికారులు పేర్కొన్నారు. ప్రకృతి విపత్తులోనే (Disaster Management Efforts) కాకుండా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను సైతం సమర్ధవంతంగా పూర్తిచేశారని (RDO Parthasarathi Reddy) అభినందించారు. అనంతరం అన్ని శాఖల అధికారులు, నాయకులు ఆర్డీవోను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీవో తాహెరా బేగం, అన్ని మండలాల తహశీల్దార్లు, సీఐ రాజిరెడ్డి, ఎస్సై మహేశ్, టీఎన్జీవో అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
అంకిత భావంతో పనిచేశా..
ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలో అంకిత భావంతో.. నిజాయితీతో పనిచేశానని ఆర్డీవో పార్థసింహారెడ్డి అన్నారు. జిల్లాలో వచ్చిన విపత్తులో పనిచేసి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు కృషి చేశానన్నారు. ఎల్లారెడ్డి ప్రజలు, నాయకులు స్నేహ పూర్వకంగా శాంతంగా ఉన్నారని కొనియాడారు. ఆర్డీవో అనే భావనతో కాకుండా పనిచేయాలనే తపనతో విధులు నిర్వహించామన్నారు. స్వేచ్చాయుత వాతావరణంలో దిశానిర్దేశంతో అధికారులు పనిచేస్తూ తనకు సహకరించారన్నారు. అందరి సాయంతో పోచారం ప్రాజెక్ట్‌ను కాపాడుకున్నామన్నారు.

ఇది కూడా చదవండి: Sarpanch Upasarpanch Dispute | కుర్చీతో పేచీ.. ఉప సర్పంచ్‌పై సర్పంచ్ ఫిర్యాదు

