అక్షరటుడే, వెబ్‌డెస్క్: Married Woman | అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో చోటుచేసుకుంది. ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామానికి చెందిన లావణ్య (26) అనుమానాస్పద స్థితిలో ఇంట్లో ఉరేసుకున్నారు.
Married Woman | పోలీసుల కథనం ఇలా..
ఎస్సై మహేష్ తెలిపిన వివరాల ప్రకారం.. లావణ్య అత్తామామల ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వారిని ఆమె భర్త ఆసుపత్రికి తీసుకెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చి చూడగా.. లావణ్య ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించారు. వెంటనే కిందికి దించి ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆమె మరణించినట్లు Married Woman వైద్యులు నిర్ధారించారు.
Married Woman | తల్లి ఫిర్యాదు మేరకు..
కాగా, తన కూతురు ఆరోగ్యం సరిగా లేదని, పుట్టింటికి వెళ్తానంటే పంపించలేదని లావణ్య తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురి మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Kavitha Clean Chit | కవిత కడిగిన ముత్యం.. చివరకు నిజమే గెలిచింది.. : సూదం లక్ష్మి

