Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Bolivia Air Force Crash | రోడ్డుపై కుప్పకూలిన విమానం.. 15 మంది దుర్మరణం.. బొలీవియాలో ఘటన
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Bolivia Air Force Crash | రోడ్డుపై కుప్పకూలిన విమానం.. 15 మంది దుర్మరణం.. బొలీవియాలో ఘటన

అంతర్జాతీయంతాజా వార్తలు

Bolivia Air Force Crash | రోడ్డుపై కుప్పకూలిన విమానం.. 15 మంది దుర్మరణం.. బొలీవియాలో ఘటన

Naresh chandan
Last updated: ఫిబ్రవరి 28, 2026 8:26 ఉద.
Naresh chandan
4 వారాలు ago
Share
Bolivia Air Force Crash | రోడ్డుపై కుప్పకూలిన విమానం.. 15 మంది దుర్మరణం.. బొలీవియాలో ఘటన
Bolivia Air Force Crash | రోడ్డుపై కుప్పకూలిన విమానం.. 15 మంది దుర్మరణం.. బొలీవియాలో ఘటన

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bolivia Air Force Crash | బొలీవియాలో విషాదం చోటుచేసుకుంది. ఇక్కడి ఎల్ ఆల్టో అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో రద్దీగా ఉండే రహదారిపై బొలీవియన్ ఎయిర్ ఫోర్స్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు.

Contents
  • Bolivia Air Force Crash | ఎల్ ఆల్టో నగరంలో
    • Bolivia Air Force Crash | విమానం రన్‌వే నుంచి జారిపోయి..
      • Bolivia Air Force Crash | భయానక దృశ్యాలు..

Bolivia Air Force Crash | ఎల్ ఆల్టో నగరంలో

బొలీవియా రాజధాని లా పాజ్‌కు ఆనుకుని ఉన్న ఎల్ ఆల్టో నగరంలో శుక్రవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. సౌత్ అమెరికన్ – గ్లోబల్ డిఫెన్స్ డెవలప్‌మెంట్‌లను ట్రాక్ చేసే SA డిఫెన్సా యొక్క X పోస్ట్ ఈ ప్రమాద ఘటనను షేర్​ చేసింది. విమానాశ్రయం సమీపంలో బొలీవియన్ ఎయిర్ ఫోర్స్ C-130 హెర్క్యులస్ కూలిపోయిందని సదరు పోస్ట్​ వెల్లడించింది.

Bolivia Air Force Crash | విమానం రన్‌వే నుంచి జారిపోయి..

సైనిక హెర్క్యులస్ విమానం శాంటా క్రజ్ నుంచి బయలుదేరింది. ఇది కొత్తగా ముద్రించిన నోట్లను రవాణా చేస్తోంది. విమానం ల్యాండింగ్ తర్వాత రన్‌వే నుంచి పక్కన వీధిలోకి జారిపోయిన తర్వాత కూలిపోయిందని స్థానిక ప్రసార సంస్థ యూనిటెల్ పేర్కొంది. కనీసం 15 మంది మరణించారని అగ్నిమాపక అధికారి పావెల్ తోవర్ తెలిపారు. కానీ, మరణించిన వారిలో ప్రయాణికులు ఉన్నారా..? లేక హైవేపై ఉన్నవారా..? అనేది మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

Bolivia Air Force Crash | భయానక దృశ్యాలు..

సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. రోడ్డుపై కొత్త నోట్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని రాయిటర్స్ వెల్లడించింది. ఒక అత్యవసర సహాయక చర్యలు కొనసాగుతుండగా.. మరోవైపు మరికొందరు చెల్లాచెదురుగా ఉన్న నగదును తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు క్లిప్పింగ్స్​ ఉన్నాయి. దీంతో స్థానిక అధికారులు జనాన్ని చెదరగొట్టడానికి నీటి గొట్టాలను ప్రయోగించినట్లు తెలుస్తోంది.

స్థానిక మీడియా ప్రసారం చేసిన చిత్రాల్లో విమానం పూర్తిగా దెబ్బతిన్నట్లు, ప్రమాదం జరిగిన రహదారిపై వాహనాలు శిథిలమైనట్లు ఉన్నాయి. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తును అధికారులు కొనసాగిస్తున్నారు. ప్రాణ, ఆస్తి నష్టాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: Iran US Tensions | జెనీవా చర్చలు విఫలం.. ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు!

Kavitha Clean Chit | కవిత కడిగిన ముత్యం.. చివరకు నిజమే గెలిచింది.. : సూదం లక్ష్మి
India Energy Security | భారత ఇంధన భద్రత, నౌకల రక్షణపై దృష్టి సారించిన కేంద్రం..
Kavuri Sambasiva Rao | కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు మృతి
Stock Market Crash | షేక్ అవుతున్న స్టాక్ మార్కెట్.. భారీ నష్టాల్లో సూచీలు
TVS Orbiter V1 | రూ.49,999 లకే టీవీఎస్ ఈవీ స్కూటర్.. ఆర్బిటర్ వీ1 ను లాంచ్ చేసిన కంపెనీ
TAGGED:aviation disaster updateBolivia plane crashC 130 Hercules crashEl Alto airport accidentLa Paz aviation newsmilitary aircraft accidentrunway skid incidentSouth America breaking news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Gold Silver Prices | స్థిరంగా బంగారం, వెండి ధరలు.. రానున్న రోజుల‌లో పెరిగే ఛాన్స్..! Gold Silver Prices | స్థిరంగా బంగారం, వెండి ధరలు.. రానున్న రోజుల‌లో పెరిగే ఛాన్స్..!
Next Article Pakistan Semifinal Chances Pakistan Semifinal Chances | ఇంగ్లండ్ విజ‌యంతో మారిన లెక్క‌లు.. పాకిస్తాన్ సెమీస్‌కి చేరాలంటే..!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?