అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Pakistan Semifinal Chances | ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 (ICC T20 World Cup 2026)లో సెమీఫైనల్ రేసు ఆసక్తికర మలుపు తిరిగింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సూపర్-8 దశలో జరిగిన తాజా మ్యాచ్ ఫలితం పాకిస్థాన్ ఆశలకి మళ్లీ ప్రాణం పోసింది.
కొలంబోలోని ప్రేమదాస స్టేడియం (Premadasa Stadium) వేదికగా జరిగిన కీలక పోరులో ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో గ్రూప్-2 సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. హ్యారీ బ్రూక్ సారథ్యంలో ఇంగ్లాండ్ జట్టు సూపర్-8లో వరుసగా మూడు విజయాలతో 6 పాయింట్లు సాధించి గ్రూప్-2 టాపర్‌గా సెమీఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. వారి గెలుపుతో న్యూజిలాండ్‌కు గట్టి దెబ్బ తగిలింది. ఇప్పటివరకు బలంగా కనిపించిన కివీస్ జట్టు ఇప్పుడు నెట్ రన్ రేట్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Pakistan Semifinal Chances | పాయింట్ల పట్టికలో ఉత్కంఠ
ప్రస్తుతం న్యూజిలాండ్ మూడు మ్యాచ్‌లు ఆడి 3 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. వారి నెట్ రన్ రేట్ +1.390గా ఉంది. మరోవైపు పాకిస్తాన్ జట్టు రెండు మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక్క పాయింట్‌తో (-0.461 NRR) మూడో స్థానంలో ఉంది. అయితే పాక్‌కు ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉండటం వారికి పెద్ద ప్లస్. శనివారం పల్లెకెలెలోని పల్లెకెలె ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (Pallekele International Cricket Stadium) వేదికగా శ్రీలంకతో జరిగే మ్యాచ్ పాకిస్థాన్‌కు డూ ఆర్ డైగా మారింది.
Pakistan Semifinal Chances | పాకిస్థాన్ సెమీఫైనల్ చేరాలంటే:
మొదట బ్యాటింగ్ చేస్తే: కనీసం 65 పరుగుల తేడాతో గెలవాలి.
చేజింగ్ చేస్తే: శ్రీలంక లక్ష్యాన్ని కేవలం 13 ఓవర్లలోనే ఛేదించాలి.
ఈ రెండు మార్గాల్లో ఏదో ఒకటి సాధించినప్పుడే పాక్ నెట్ రన్ రేట్ న్యూజిలాండ్ కంటే మెరుగ్గా మారుతుంది. ముఖ్యంగా శ్రీలంకను 100 పరుగుల లోపే కట్టడి చేస్తే సమీకరణం మరింత సులభమవుతుంది.
పల్లెకెలెలో వర్షం సూచనలు లేవని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశం మేఘావృతంగా ఉన్నా పూర్తి మ్యాచ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది కూడా పాకిస్థాన్‌కు కలిసొచ్చే అంశమే. ఇప్పటికే జింబాబ్వే, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ (New Zealand) చేతిలో వరుస ఓటములతో శ్రీలంక నిరాశలో ఉంది. ఈ బలహీనతను సద్వినియోగం చేసుకుని పాక్ భారీ విజయం నమోదు చేస్తే సెమీస్ బెర్త్ ఖాయం కావచ్చు. లేనిపక్షంలో న్యూజిలాండ్ నేరుగా సెమీఫైనల్‌కు చేరుతుంది. ఇప్పుడంతా పాకిస్థాన్ ప్రదర్శనపైనే ఆధారపడి ఉంది. ఒక భారీ విజయం సాధిస్తే సెమీస్ కల నిజమవుతుంది… లేకపోతే టోర్నీ నుంచి నిష్క్రమణ తప్పదు.
ఇది కూడా చదవండి..: T20 World Cup | సెమీస్ ఆశలు పదిలం.. జింబాబ్వేపై భారత జట్టు విజయభేరి

