Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Israel Iran Tensions | ఇజ్రాయెల్​ దాడులు.. సురక్షిత ప్రాంతానికి ఇరాన్​ సుప్రీం లీడర్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Israel Iran Tensions | ఇజ్రాయెల్​ దాడులు.. సురక్షిత ప్రాంతానికి ఇరాన్​ సుప్రీం లీడర్​

అంతర్జాతీయం

Israel Iran Tensions | ఇజ్రాయెల్​ దాడులు.. సురక్షిత ప్రాంతానికి ఇరాన్​ సుప్రీం లీడర్​

ఇజ్రాయెల్​ దాడులతో ఇరాన్​ సుప్రీం లీడర్​ ఖమేనిని అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇరు దేశాల్లో సైరన్ల మోతతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Srinivas kolluri
Last updated: ఫిబ్రవరి 28, 2026 1:31 సా.
Srinivas Kolluri
4 వారాలు ago
Share
Israel Iran Tensions
Israel Iran Tensions

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Israel Iran Tensions | ఇరాన్​పై ఇజ్రాయెల్ దాడులతో మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. శనివారం ఉదయం టెల్​అవీవ్​ టెహ్రాన్​పై క్షిపణులతో దాడులు చేసింది. ఇరాన్​ సుప్రీం లీడర్​ ఖమేని (Supreme Leader Khamenei) నివాసానికి సమీపంలో పేలుడు చోటు చేసుకోవడం గమనార్హం.

Contents
  • Israel Iran Tensions | సైరన్ల మోత
    • Israel Iran Tensions | వెంటనే దేశాన్ని వీడండి
      • Israel Iran Tensions | భారత్​ అడ్వైజరీ

ఇజ్రాయెల్​తో పాటు అమెరికా సైతం దాడుల్లో పాల్గొంది. షీల్డ్ ఆఫ్ జూద్ (Shield of Judah) పేరుతో ఆపరేషన్ నిర్వహించాయి. 30 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడులు చేపట్టారు. నార్త్, ఈస్ట్ టెహ్రాన్​పై బాంబుల వర్షం ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. దీంతో ఇరాన్​ అధికారులు తమ సుప్రీ లీడర్​ అయేతుల్లా ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించారు. చర్చలపై సంతృప్తిగా లేనని ట్రంప్ ప్రకటించిన కాసేపటికే దాడులు చోటు చేసుకోవడం గమనార్హం. తన మాటల్ని ఇరాన్ పట్టించుకోవడం లేదని ట్రంప్ పేర్కొన్నారు.

Israel Iran Tensions | సైరన్ల మోత

ఇజ్రాయెల్​ దాడులతో ఇరాన్​ ప్రతీకార దాడులు చేపట్టే అవకాశం ఉంది. దీంతో రెండు దేశాల్లో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇరాన్​, ఇజ్రాయెల్​లో సైరన్ల మోత మోగుతుంది. కార్యాలయాలకు, విద్య సంస్థలకు ఇరు దేశాలు సెలవు ప్రకటించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ అణు చర్చలు సంతృప్తికరంగా లేవన్నారు. ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండకూడదని చెప్పారు. అమెరికా విదేశాంగ శాఖ తమ దేశస్తులకు అడ్వైజరీ జారీ చేసింది. ఇరాన్​కు ప్రయాణాలు చేయొద్దని సూచించింది.

Israel Iran Tensions

Israel Iran Tensions | వెంటనే దేశాన్ని వీడండి

ఇటలీ, జర్మనీ, పోలాండ్, కజకిస్తాన్, చైనాతో సహా అనేక దేశాలు తమ పౌరులు ఇరాన్‌ను విడిచి వెళ్లాలని కోరాయి. ఇస్తాంబుల్, టెహ్రాన్ మధ్య విమానాలు రద్దు అయ్యాయి. ఇజ్రాయెల్ దాడి తర్వాత తమ వైమానిక ప్రాంతాన్ని మూసివేసినట్లు ఇరాక్ రవాణా మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. ఇజ్రాయెల్ కూడా పౌర విమానాలకు తన వైమానిక ప్రాంతాన్ని మూసివేసింది.

Israel Iran Tensions | భారత్​ అడ్వైజరీ

ఇజ్రాయెల్‌లో ఉంటున్న భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. ఆ దేశ అధికారులు జారీ చేసే భద్రతా మార్గదర్శకాలను అనుసరించాలని సూచించింది. సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని, అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని పేర్కొంది. సహాయం కోసం భారత ఎంబసీని సంప్రదించాలని సూచించింది.

ఇది కూడా చదవండి..: Iran US Tensions | జెనీవా చర్చలు విఫలం.. ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు యథాతథం!

Iran US Tensions | జెనీవా చర్చలు విఫలం.. ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు యథాతథం!
Russian Oil Tanker | రూటు మార్చిన రష్యన్ ఆయిల్ ట్యాంకర్.. చైనాకు వెళ్లకుండా భారత్ వైపు రాక
Minuteman III Missile | అణు క్షిపణిని పరీక్షించిన అమెరికా.. ఇరాన్‌పై దాడుల వేళ ప్రయోగం..
 Iran Yuan Oil Payments | అమెరికాకు ఇరాన్​ బిగ్​ షాక్​.. చైనీస్​ యువాన్​తో చెల్లింపులు
Middle East Oil Loss | ఇరాన్​ – ఇజ్రాయెల్​ – అమెరికా యుద్ధం.. భారీగా క్రూడ్​ ఆయిల్​ ధ్వంసం.. నష్టం ఎంతంటే!
TAGGED:Ayatollah KhameneiDonald Trump statementglobal travel advisoryIsrael Iran tensionsMiddle East CrisisTehran airstrike newsUS Iran conflict
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article South Central Railway Offer South Central Railway Offer | ఒకే టికెట్‌తో వేర్వేరు తీర్థయాత్రలు.. సౌత్ సెంట్రల్ రైల్వే సూపర్ ఆఫర్
Next Article London Fire Incident London Fire Incident | లండన్​లో నిజామాబాద్​ విద్యార్థి మృతి
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?