Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: HPV Vaccination Drive | ఆడబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడేందుకు హెచ్​పీవీ వ్యాక్సినేషన్​ : మంత్రి రాజనర్సింహ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - HPV Vaccination Drive | ఆడబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడేందుకు హెచ్​పీవీ వ్యాక్సినేషన్​ : మంత్రి రాజనర్సింహ

హైదరాబాద్తెలంగాణ

HPV Vaccination Drive | ఆడబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడేందుకు హెచ్​పీవీ వ్యాక్సినేషన్​ : మంత్రి రాజనర్సింహ

కింగ్ కోఠి హాస్పిటల్‌లో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు. 14 ఏళ్ల నిండిన బాలికలకు వ్యాక్సిన్ వేయించాలని సూచించారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఫిబ్రవరి 28, 2026 2:03 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
4 వారాలు ago
Share
HPV Vaccination Drive
HPV Vaccination Drive

అక్షరటుడే, వెబ్​డెస్క్: HPV Vaccination Drive | హైదరాబాద్‌ నగరంలోని కింగ్ కోఠి హాస్పిటల్‌ (King Kothi Hospital)లో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు. వ్యాక్సిన్​ వేయించికున్న బాలికలకు ఆయన సర్టిఫికెట్లు ప్రధానం చేశారు.

Contents
  • HPV Vaccination Drive | చారిత్రాత్మక ఘట్టం
    • HPV Vaccination Drive | సమగ్ర పాలసీ
      • HPV Vaccination Drive | రెండో స్థానంలో..

మహిళల్లో గర్భాశయ క్యాన్సర్​ నివారించేందుకు హెచ్​పీవీ వ్యాక్సిన్​ (HPV Vaccin) వేస్తున్న విషయం తెలిసిందే. నేటి నుంచి 3 నెలల వరకూ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగనుంది. మొదటి నెల రోజుల వరకూ ప్రభుత్వ జనరల్ హాస్పిటళ్లు, ఏరియా హాస్పిటళ్లు, కమ్యునిటీ హెల్త్‌ సెంటర్లలో వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయి. తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ అందుబాటులోకి రానున్నాయి.

HPV Vaccination Drive | చారిత్రాత్మక ఘట్టం

మంత్రి దామోదర్​ రాజనర్సింహ (Damodar Rajanarsimha) మాట్లాడుతూ.. ఈ రోజు ఆరోగ్య రంగంలో చారిత్రాత్మక ఘట్టం అన్నారు. ఆడబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కాలుష్యం వంటి కారణాలతో దేశవ్యాప్తంగా క్యాన్సర్ విస్తరిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ఏటా 55 వేల నుంచి 60 వేల క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని వెల్లడించారు.

HPV Vaccination Drive | సమగ్ర పాలసీ

క్యాన్సర్​ మహమ్మారిని ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక సమగ్ర పాలసీని రూపొందించిందని మంత్రి తెలిపారు. ములుగు, ఆదిలాబాద్ (Adilabad) వంటి మారుమూల జిల్లాల్లో కూడా ఇప్పుడు కీమోథెరపీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ప్రతి జిల్లాలో డే కేర్ క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. క్యాన్సర్ చికిత్సా రంగంలో ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ నోరి దత్తాత్రేయుడును సలహాదారుగా నియమించుకొని, ఆయన సూచనలతో వ్యాది కట్టడికి అనేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

HPV Vaccination Drive | రెండో స్థానంలో..

దేశంలో మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో సర్వైకల్ కేన్సర్ రెండో స్థానంలో ఉందని దామోదర్​ రాజనర్సింహ తెలిపారు. రాష్ట్రంలో ఏటా సగటున 3,200 మంది మహిళలు దీని బారిన పడుతున్నారని చెప్పారు. ముందస్తుగా నివారించగలిగే ఏకైక క్యాన్సర్ ఇదే అన్నారు. హ్యూమన్ పాపిలోమా అనే వైరస్​తో ఇది వస్తుందన్నారు. ఆ వైరస్‌ను అంతం చేయడానికే… కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా HPV వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించినట్లు వెళ్లడించారు. ఇందులో భాగంగా 14 ఏళ్లు నిండి 15 ఏళ్లలోపు బాలికలందరికీ వ్యాక్సిన్ వేయనున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Sharada Peeth Demolition Row | శారద పీఠాన్ని కూల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర: హరీశ్​ రావు

Bachupally Fire Victims | బాచుపల్లి బాధితులకు అండగా ఉంటాం : ఎంపీ ఈటల
Assembly Whips Appointment | శాసన సభ, మండలికి కొత్త విప్​ల నియామకం
Kavitha Siddipet Contest | సిద్ధిపేట నుంచి కల్వకుంట్ల కవిత పోటీకి దిగనుందా.. నెట్టింట వైరల్​!
Half Day Schools | విద్యార్థులకు గుడ్​న్యూస్​.. 15 నుంచి ఒంటిపూట బడులు
Hyderabad Timber Depot Fire | హైదరాబాద్​లో మరో అగ్ని ప్రమాదం
TAGGED:Adilabadcancer awareness Indiacervical cancer preventionDamodar Rajanarasimhagirls vaccination programHPV VaccinHPV Vaccination DriveHyderabad health newsKing Kothi Hospitalpublic health initiativeTelangana health department
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article London Fire Incident London Fire Incident | లండన్​లో నిజామాబాద్​ విద్యార్థి మృతి
Next Article Realme Narzo Power 5G Realme Narzo Power 5G | ఇది రియల్‌మీ ‘పవర్’!.. భారీ బ్యాటరీతో లాంచింగ్‌కు సిద్ధం
7 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?