Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kakinada Fireworks Explosion | బాణసంచా పరిశ్రమలో పేలుడు.. 20 మంది మృతి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆంధ్రప్రదేశ్​ - Kakinada Fireworks Explosion | బాణసంచా పరిశ్రమలో పేలుడు.. 20 మంది మృతి

ఆంధ్రప్రదేశ్​క్రైం

Kakinada Fireworks Explosion | బాణసంచా పరిశ్రమలో పేలుడు.. 20 మంది మృతి

కాకినాడ జిల్లాలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. బాణాసంచ ఫ్యాక్టరీ పేలుడు సంభవించడంతో 20 మంది మృతి చెందారు.

Srinivas kolluri
Last updated: ఫిబ్రవరి 28, 2026 4:08 సా.
Srinivas Kolluri
4 వారాలు ago
Share
Kakinada Fireworks Explosion

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kakinada Fireworks Explosion | కాకినాడ (Kakinada) జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ పేలుడు సంభవించింది.

Contents
  • Kakinada Fireworks Explosion | 5 కి.మీ. మేర..
    • Kakinada Fireworks Explosion | సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

వేట్లంపాడు, జి.మేడపాడు మధ్యలో ఉన్న బాణసంచా తయారీ పరిశ్రమలో పెద్ద ఎత్తున పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో 20 మంది కార్మికులు సజీవ దహనం అయ్యారు. సూర్యశ్రీ ఫైర్ వర్క్స్‌ బాణసంచా తయారీ కేంద్రంలో బ్లాస్ట్​ అయింది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 35 మంది కార్మికులు ఉన్నారు. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Kakinada Fireworks Explosion | 5 కి.మీ. మేర..

బాణసంచ తయారీ కేంద్రం (Kakinada Fireworks Explosion )లో మధ్యాహ్నం ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ శబ్ధం 5 కిలోమీటర్ల వరకు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మంటలు అదుపులోకి రావడం లేదు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ 8 మందిని ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో మహిళలే అధికంగా ఉన్నట్లు సమాచారం.

Kakinada Fireworks Explosion | సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

వేట్లపాలెం పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై ఆయన ఆరా తీశారు. వెంటనే ఘటనాస్థలికి వెళ్లాలని హోంమంత్రి అనితను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో హోంమంత్రి ఘటన స్థలానికి బయలు దేరారు. కలెక్టర్, ఎస్పీ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

fireworks

ఇది కూడా చదవండి..: AP Group 1 Case | గ్రూప్‌-1 అధికారులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

Several feared injured in blast at crackers unit in Andhra Pradesh-Kakinada.#Kakinada #fireaccident #AndhraPradesh#AndhraPradesh #fireaccident #Kakinada pic.twitter.com/hCyM4tTvkW

— Raja Sekhar (@Geetha_Ram2) February 28, 2026

Drunk Driving Penalties | డ్రంకన్​ డ్రైవ్​ కేసుల్లో ఇద్దరికి జైలు.. పలువురికి జరిమానా
Palamaneru Road Accident | పలమనేరు బైపాస్‌లో ఘోర ప్రమాదం.. లారీని ఢీకొట్టిన కారు.. ఐదుగురు దుర్మరణం
Auto Accident Kamareddy | ఆటో బోల్తా.. ఇద్దరు చిన్నారులకు గాయాలు
Tirumala Devotee Rush | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ కంపార్టుమెంట్లు ఫుల్​..
Odisha | దారుణం: ఒకేరోజు రెండుసార్లు అత్యాచారం, అనంతరం నాలుగో అంతస్తు నుంచి తోసి హత్య
TAGGED:Andhra Pradesh NewsChandrababu Naidu reactionFactory fire tragedyFireworks factory explosionIndustrial accident IndiaKakinada blastSamarlakota incident
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Owaisi Brothers Home Department | Owaisi Brothers Home Department | రాష్ట్రంలో ఒవైసీ బ్రదర్స్ చేతిలో హోంశాఖ: బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
Next Article Kamareddy SI Retirement Kamareddy SI Retirement | ఇద్దరు ఎస్సైల పదవీ విరమణ
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?