అక్షరటుడే, హైదరాబాద్: Gold Silver Prices | అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ముదరడం, ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ Ali Khamenei మృతి చెందినట్టు వచ్చిన వార్తలు, అలాగే ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతుండటంతో గ్లోబల్ స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకులకు లోనయ్యాయి.
ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంపై భారీగా మొగ్గు చూపుతున్నారు. అమెరికా అధ్యక్షుడు Donald Trump ఇరాన్‌పై యుద్ధం కొనసాగుతూనే ఉంటుందని ప్రకటించడం ఉద్రిక్తతలను మరింత పెంచింది.
Gold Silver Prices | ధరలు పైపైకి..
ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లలో గోల్డ్, సిల్వర్ ధరలు Silver Prices ఎగసిపడుతున్నాయి. యుద్ధ పరిస్థితులు చల్లారే వరకు ఈ పెరుగుదల కొనసాగవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) ఎలా ఉన్నాయనేది చూస్తే..
- హైదరాబాద్‌లో 24 క్యారెట్లు: ₹1,68,710 – 22 క్యారెట్లు: ₹1,54,650గా ఉంది.
- విజయవాడ & విశాఖపట్నంలలో 24 క్యారెట్లు: ₹1,68,710 – 22 క్యారెట్లు: ₹1,54,650గా ఉంది.
- చెన్నైలో 24 క్యారెట్లు: ₹1,69,640 – 22 క్యారెట్లు: ₹1,55,500గా ఉంది.
- బెంగళూరులో 24 క్యారెట్లు: ₹1,68,710 – 22 క్యారెట్లు: ₹1,54,650గా ట్రేడ్ అయింది.
- ఢిల్లీలో 24 క్యారెట్లు: ₹1,68,860 – 22 క్యారెట్లు: ₹1,54,800గా ఉంది.
- దేశ రాజధాని ఢిల్లీలో Delhi ధరలు కొద్దిగా ఎక్కువగా ఉండగా, దక్షిణ భారత నగరాల్లో కూడా బంగారం రేట్లు గరిష్ట స్థాయికి చేరాయి.
Gold Silver Prices | వెండి ధరలు
వెండి ధర (కిలోకు) ఢిల్లీలో ₹2.95 లక్షలుగా ఉండగా, హైదరాబాద్లో ₹3.20 లక్షలు, విజయవాడ & విశాఖపట్నం – ₹3.20 లక్షలుగా ఉంది. చెన్నై – ₹3.20 లక్షలు, బెంగళూరు – ₹2.95 లక్షలుగా ట్రేడ్ అయింది. వెండి ధరలు కూడా బంగారానికి అనుసంధానంగా భారీగా పెరిగాయి.
ముఖ్యంగా హైదరాబాద్, చెన్నై మార్కెట్లలో కిలో వెండి ₹3.20 లక్షల వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులు, స్టాక్ మార్కెట్లలో అస్థిరత, డాలర్ మారకం విలువ మార్పులు, సురక్షిత పెట్టుబడులపై ఇన్వెస్టర్ల దృష్టి వలన ధరలు భారీగా పెరుగుతున్నాయి.

