అక్షర టుడే, ఇందూరు: RSS Nitya Shakha | రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వందేళ్ల ప్రయాణానికి ప్రాణం నిత్యశాఖ (Nitya Shakha) మాత్రమేనని, శాఖలో తయారైన కోట్లాదిమంది స్వయం సేవకులు దేశంకోసం పనిచేస్తున్నారని ఆర్ఎస్ఎస్ తెలంగాణ సహప్రాంత ప్రచారక్ కల్పగురి ప్రభు కుమార్ తెలిపారు. ఆర్ఎస్ఎస్ (RSS Centenary) వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా కేంద్రంలోని (Induru Event) గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల (Giriraj Government College) మైదానంలో నగర సంగమం నిర్వహించారు.
RSS Nitya Shakha | దేశంలోని అన్ని ప్రాంతాలకు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వందేళ్ల ప్రయాణంలో దేశంలోని అన్ని ప్రాంతాలకు ఆర్ఎస్ఎస్ (Telangana RSS) విస్తరించిందని, కార్యకర్తల సంఖ్య పెరిగిన ప్రతిచోట సమాజంలో సౌభ్రాతృత్వం, దేశభక్తి పెరిగి ఆయా ప్రాంతాలు సుభిక్షంగా ఉన్నాయన్నారు. ఎంతోమంది దేశభక్తులు స్వాతంత్ర పోరాటంలో (Hindu Organization) పాల్గొన్న వారు కూడా సంఘ కార్యం ఆవశ్యకతను గుర్తించారని తెలిపారు. సంఘస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ భారతదేశంలో స్వాతంత్రం కోల్పోవడానికి మూల కారణమైన అసంఘటిత హిందూ సమాజాన్ని సంఘటితంగా చేయడం మాత్రమే దీనికి శాశ్వతమైన పరిష్కారమని గుర్తించారని చెప్పారు. అందుకే ఆయన నిత్య శాఖ అనే మూలమంత్రాన్ని సంఘ యొక్క సిద్ధాంత భూమికగా తయారు చేశారన్నారు.
RSS Nitya Shakha | ప్రతిరోజూ.. ఒకగంట..
ప్రతిరోజూ ఒక గంట పాటు కలిసి చేసే పనుల వల్ల (Daily Shakha) వ్యక్తుల మధ్య సమన్వయం ఏర్పడి, ఆ వ్యక్తుల సమూహం సమాజం, ధర్మం కోసం, దేశం కోసం పనిచేసేలా ప్రభుకుమార్ రగులుతుందన్నారు. శాఖలో 40 నిమిషాల శారీరక కార్యక్రమాల ద్వారా స్వయం సేవకుల శారీరక సౌష్టవం, ఆరోగ్యం బాగుంటుందని తెలిపారు. 10 నిమిషాలు బౌద్ధిక్ కార్యక్రమాల వల్ల దేశభక్తి, ధర్మ నిష్ట అలవాటు చేసుకుంటారని వివరించారు.
RSS NityaShakha | ఇందూరు ఎంతో చారిత్రక నేపథ్యం..
ఇందూరు ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన నగరమని, ఇక్కడి హిందువులు (Hindu Organization) ఎంతో ధర్మనిష్ట కలిగిన వారని ప్రభుకుమార్ ప్రశంసించారు. సంఘం ప్రారంభమై వందేళ్లు పూర్తికావడం.. ఇందూరులో మొట్టమొదటి సంఘ శాఖ ప్రారంభమై 75 సంవత్సరాలు పూర్తి కావడం ఎంతో ప్రత్యేకమైనదన్నారు. క్రమశిక్షణ, సమయపాలన, దేశభక్తి, ధర్మనిష్ట, వ్యక్తిగత శీలం, జాతీయ శీలం, సంస్కారం, సంస్కృతి పరిరక్షణ అనే ఎన్నో సుగుణాలను శాఖ ఆధారంగా స్వయంసేవకులు ఉపాసన చేస్తున్నారని గుర్తు చేశారు. ఆర్ఎస్ఎస్ శాఖ అంటే సమాజ సంస్కారాలకు కేంద్ర బిందువు అని, ఏ రాజకీయ అవసరాలు లేవని స్పష్టం చేశారు.
శాఖలేని బస్తీల్లో శాఖలు ప్రారంభించాలని, శతాబ్ది సందర్భంగా శాఖ లేని బస్తీ ఉండకూడదని తెలిపారు. కేవలం ఒకసారి చేసే సాధన కాదని, సమాజ కల్యాణం కోసం భరతమాత కోసం నిరంతరం నిర్విరామంగా ఆచరించే ఒక పవిత్ర యజ్ఞంగా భావించాలని పిలుపునిచ్చారు. సంఘ శాఖ కేవలం ఆర్ఎస్ఎస్ కోసం కాదని సమాజంలో విపత్తులు, సమస్యలు, ఉపద్రవాలు వచ్చినప్పుడు సకాలంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం కోసం, ప్రజలను కాపాడడం కోసమని తెలిపారు. కార్యక్రమంలో నగర కార్యవాహ అర్గుల సత్యం, సహకార్యవాహాలు సుమిత్ కుమార్, వెంకటేష్, నగర, జిల్లా స్వయం సేవకులు తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా
ఇది కూడా చదవండి: Vijay Rashmika Wedding | విరోష్ పెళ్లి సందడి : దేశవ్యాప్తంగా స్వీట్లు, దేవాలయాల్లో అన్నదానం…



