Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Maharashtra Factory Explosion | మహారాష్ట్రలో భారీ పేలుడు.. 17 మంది మృతి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Maharashtra Factory Explosion | మహారాష్ట్రలో భారీ పేలుడు.. 17 మంది మృతి

జాతీయం

Maharashtra Factory Explosion | మహారాష్ట్రలో భారీ పేలుడు.. 17 మంది మృతి

మహారాష్ట్రలోని నాగ్​పూర్​లో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు.

Srinivas kolluri
Last updated: మార్చి 1, 2026 3:40 సా.
Srinivas Kolluri
4 వారాలు ago
Share
Maharashtra Factory Explosion

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maharashtra Factory Explosion | మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నాగ్‌పూర్ (Nagpur) జిల్లాలోని ఒక పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో ఆదివారం ఉదయం పేలుడు సంభవించంగా.. 17 మంది మరణించారు.

Contents
  • Maharashtra Factory Explosion | ఆస్పత్రికి తరలింపు
    • Maharashtra Factory Explosion | ప్రధాని విచారం
      • విషాదకరం

కటోల్ తహసీల్‌లోని రౌల్‌గావ్‌లోని ఎస్‌బీఎల్ ఎనర్జీ లిమిటెడ్ (SBL Energy Limited) ఫ్యాక్టరీలో పేలుడు చోటు చేసుకుంది. కంపెనీ డిటోనేటర్ ప్యాకింగ్ యూనిట్‌లో ఈ ప్రమాదం జరగింది. తీవ్రత అధికంగా ఉండటంతో ఇప్పటి వరకు 17 మంది చనిపోయారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.

Maharashtra Factory Explosion | ఆస్పత్రికి తరలింపు

కలెక్టర్ విపిన్ ఇటాంకర్, పోలీసు సూపరింటెండెంట్ హర్ష్ పోదార్‌తో సహా స్థానిక అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షించడానికి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన 18 మందిని వెంటనే చికిత్స కోసం నాగ్‌పూర్‌లోని ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మృతులను గుర్తించడానికి, వారి కుటుంబాలకు తెలియజేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలోని ఒక బాణసంచా తయారీ పరిశ్రమలో శనివారం పేలుడు చోటుచేసుకొని 21 మంది ప్రాణాలు కోల్పోయారు.

Maharashtra Factory Explosion | ప్రధాని విచారం

మహారాష్ట్ర పేలుడు ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు రూ.రెండు లక్షల చొప్పున గాయపడిన వారికి రూ. 50 వేల పరిహారం అందిస్తామని తెలిపారు.

విషాదకరం

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) ఈ ఘటనపై ఎక్స్​ వేదికగా స్పందించారు. చాలా దురదృష్టకరం, విషాదకరం అని అభివర్ణించారు. స్థానిక అధికారులతో మాట్లాడి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 17 మంది ప్రాణాలు కోల్పోయారని సీఎం పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఘటనా స్థలంలో సహాయ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

nagpur

దీనిని కూడా చదవండి : Kakinada Fireworks Explosion | బాణసంచా పరిశ్రమలో పేలుడు.. 20 మంది మృతి

CA Results 2026 | సీఏ ఫలితాలు విడుదల
West Bengal Elections | పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక అప్​డేట్​.. 291 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన మమతా బెనర్జీ!
Iran Israel War live updates | ఇరాన్​ అధ్యక్షుడికి భారత్​ ప్రధాని ఫోన్.. యుద్ధం మొదలయ్యాక తొలిసారి పలకరింపు!​
IRCTC South India Tour | ఐఆర్​సీటీసీ సూపర్ ప్యాకేజీ.. రూ.14,500లకే దక్షిణాది యాత్ర
New Governors Appointed | పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్​లు.. తెలంగాణ గవర్నర్​గా శివప్రతాప్​ శుక్లా
TAGGED:Devendra FadnavisMaharashtraMaharashtra Factory ExplosionSBL Energy Limited
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Shabbir Ali TNGOs Meeting | Shabbir Ali TNGOs Meeting | షబ్బీర్​ అలీని కలిసిన టీఎన్జీవోస్​ నేతలు
Next Article Munnuru Kapu Unity | Munnuru Kapu Unity | మున్నూరు కాపులు ఐక్యంగా ఉండాలి: మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్​
3 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?