Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: 15 Maoists Surrender | 15 మంది మావోయిస్ట్​ల లొంగుబాటు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - 15 Maoists Surrender | 15 మంది మావోయిస్ట్​ల లొంగుబాటు

జాతీయం

15 Maoists Surrender | 15 మంది మావోయిస్ట్​ల లొంగుబాటు

ఛత్తీస్​గఢ్​లో 15 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో తెలంగాణకు చెందిన ముప్పిడి సాంబయ్య ఉన్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 1, 2026 3:20 సా.
Srinivas Kolluri
4 వారాలు ago
Share
15 Maoists Surrender

అక్షరటుడే, వెబ్​డెస్క్ : 15 Maoists Surrender | మావోయిస్టుల లొంగుబాట కొనసాగుతోంది. ఆపరేషన్​ కగార్​తో బలగాలు చొచ్చుకు వస్తుండటం, ఎన్​కౌంటర్లలో అనేక మంది హతం అవుతుండటంతో నక్సల్స్​ ఆయుధాలు వీడుతున్నారు.

Contents
  • 15 Maoists Surrender | ఒడిశా కార్యదర్శిగా..
    • 15 Maoists Surrender | ఆయుధాల అప్పగింత

ఛత్తీస్​గఢ్​ (Chhattisgarh)లో తాజాగా 15 మంది మావోయిస్టులు లొంగిపోయారు (15 Maoists Surrender). మావోయిస్ట్ పార్టీ సెక్రెటరీ దేవ్​జీ, కీలక నేతలు రాజిరెడ్డి, చొక్కారావు తదితరులు ఇటీవల లొంగిపోయిన విషయం తెలిసిందే. దీంతో వీరి బాటలోనే చాలా మంది సరెండర్​ కావడానికి సిద్ధం అవుతున్నారు. తెలంగాణకు చెందిన అనేక మంది కీలక నేతలు ఇప్పటికే లొంగిపోగా.. పలువురు అడవుల్లో ఉన్నారు. వారిలో తాజాగా ముప్పిడి సాంబయ్య అలియాస్ వికాస్ లొంగిపోయారు.

15 Maoists Surrender | ఒడిశా కార్యదర్శిగా..

వరంగల్ (Warangal) జిల్లా తరాలపల్లికి చెందిన సాంబయ్య (Sambaiah) ప్రస్తుతం ఒడిశా రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉన్నారు. శనివారం ఆయన తన 15 మంది అనుచరులతో కలిసి ఛత్తీస్​గఢ్​ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ మేరకు ఆదివారం అధికారులు వివరాలు వెల్లడించారు. బలంగీర్-బార్‌ఘర్-మహాసముంద్ (BBM) డివిజన్‌కు చెందిన 15 మంది మావోయిస్టు కార్యకర్తలు లొంగిపోయారని పోలీసులు తెలిపారు. వీరిలో వికాష్ (స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు), దినేష్, కవిత, సవిత, మంగేష్, రింకు, జుగ్ను, అస్మిత, సస్మిత, సాస్మిత తదితరులు ఉన్నారు. ఇందులో ఇద్దరు డివిజన్​ కమిటీ సభ్యులు కాగా, ఐదుగురు ఏరియా కమిటీ సభ్యులు, ఏడుగురు ప్లాటూన్ సభ్యులు ఉన్నారు.

15 Maoists Surrender | ఆయుధాల అప్పగింత

లొంగిపోయిన మావోయిస్టులు పోలీసులకు తమ ఆయుధాలు అప్పగించారు. మూడు AK-47 రైఫిల్స్, రెండు SLRలు, మూడు 303 రైఫిల్స్, మూడు 12-బోర్ గన్లు, రెండు INSAS రైఫిల్స్, ఒక 14 మస్కెట్ (మ్యాగజైన్ లేని 303 రైఫిల్) అప్పగించారు. రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్ట్​ల లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్నాయి. మరోవైపు కేంద్రం ఆపరేషన్​ కగార్​ పేరిట తరముతోంది. దీంతో మావోయిస్టులు అడవులను వీడుతున్నారు. ఈ నెల 31 వరకు దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్రం ప్రకటించింది. గడువు సమీపిస్తుండటంతో బలగాలు అడవుల్లో ఉన్న మావోల కోసం వేట కొనసాగిస్తున్నాయి.

ఇది కూడా చదవండి : Maharashtra Factory Explosion | మహారాష్ట్రలో భారీ పేలుడు.. 17 మంది మృతి

Jharkhand Bus Accident | ఘాట్ రోడ్డు దిగుతుండగా ఘోరం.. బస్సు బ్రేకులు ఫెయిల్.. ఐదుగురు దుర్మరణం
Jal Jeevan Mission Extension | కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు.. జల్ జీవన్ మిషన్‌ పొడిగింపు..
IRCTC South India Tour | ఐఆర్​సీటీసీ సూపర్ ప్యాకేజీ.. రూ.14,500లకే దక్షిణాది యాత్ర
Monalisa Love Marriage | తండ్రిపై కేసు పెట్టి.. ప్రియుడిని పెళ్లి చేసుకున్న కుంభమేళా మోనాలిసా
Delhi Liquor Scam Case | లిక్కర్​ స్కాం కేసు.. హైకోర్టును ఆశ్రయించిన సీబీఐ
TAGGED:Chhattisgarh NewsIndian Security ForcesMaoists SurrenderMuppidi SambayyaNaxal MovementOdisha MaoistsOperation KagaarTelangana Naxals
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Munnuru Kapu Unity | Munnuru Kapu Unity | మున్నూరు కాపులు ఐక్యంగా ఉండాలి: మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్​
Next Article Babli Water Release | Babli Water Release | బాబ్లీ ప్రాజెక్ట్​ గేట్ల ఎత్తివేత
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?