Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Iran Acting Supreme Leader | ఇరాన్​ తాత్కాలిక సుప్రీం లీడర్​గా ఆయతుల్లా అరాఫీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Iran Acting Supreme Leader | ఇరాన్​ తాత్కాలిక సుప్రీం లీడర్​గా ఆయతుల్లా అరాఫీ

అంతర్జాతీయం

Iran Acting Supreme Leader | ఇరాన్​ తాత్కాలిక సుప్రీం లీడర్​గా ఆయతుల్లా అరాఫీ

ఇరాన్​ తాత్కాలిక సుప్రీం లీడర్​గా అలీరెజా అరాఫీ ఎంపికయ్యారు. అమెరికా, ఇజ్రాయెల్​ దాడుల్లో సుప్రీం లీడర్​ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే.

Srinivas kolluri
Last updated: మార్చి 1, 2026 7:54 సా.
Srinivas Kolluri
4 వారాలు ago
Share
Iran Acting Supreme Leader

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Iran Acting Supreme Leader | ఇరాన్​ తాత్కాలిక సుప్రీం లీడర్​గా ఖమేనీ (Khameni) సన్నిహితుడు ఆయుతుల్లా అలీరెజా అరాఫీ (Alireza Arafi) ఎంపికయ్యారు. ఇరాన్​లో తాత్కాలిక ప్రభుత్వం కొలువు దీరింది.

Contents
  • Iran Acting Supreme Leader | అరాఫీ నేపథ్యం..
    • Iran Acting Supreme Leader | విస్తృత అధికారాలు
      • త్వరలో కొత్త నాయకుడు

అమెరికా, ఇజ్రాయెల్​ దాడుల్లో ఇరాన్​ సుప్రీం లీడర్​ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్​ ప్రతీకార దాడులకు దిగింది. ముఖ్యంగా గల్ఫ్​ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్లు, క్షిపణులు ప్రయోగిస్తుంది. ఈ సమయంలో ఆ దేశానికి సుప్రీం లీడర్​గా అనుభవజ్ఞుడైన మతాధికారి, ఖమేనీ సన్నిహితుడు అయిన ఆయతుల్లా అరాఫీని ఎంపిక చేశారు. సుప్రీం లీడర్ పాత్రను తాత్కాలికంగా నిర్వర్తించే నాయకత్వ మండలిలో అరాఫీని న్యాయశాస్త్ర సభ్యుడిగా నియమించారు. ముగ్గురు సభ్యుల ఈ మండలిలో అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్, ప్రధాన న్యాయమూర్తి ఘోలాంహోస్సేన్ ʹమొహ్సేని ʹఎజీ కూడా ఉన్నారు.

Iran Acting Supreme Leader | అరాఫీ నేపథ్యం..

అయతుల్లా అలీ ఖమేనీ తర్వాత పదవికి పోటీపడే వారిలో అరాఫీ ఒకరు. 67 ఏళ్ల ఆయన అనుభవజ్ఞుడైన మతాధికారి, అంతేగాకుండా ఖమేనీ సన్నిహితుడు. అరాఫీ ప్రస్తుతం సుప్రీం లీడర్‌ను నియమించే అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్‌కు డిప్యూటీ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. గతంలో గార్డియన్ కౌన్సిల్ సభ్యుడిగా పని చేశారు. ఆయన ఇరాన్ (Iran) సెమినరీ వ్యవస్థకు కూడా నాయకత్వం వహిస్తారు. ఆయనకు భద్రతా సంస్థతో బలమైన సంబంధాలకు లేవని తెలుస్తోంది.

Iran Acting Supreme Leader | విస్తృత అధికారాలు

ఇరాన్​లో సుప్రీం నాయకుడు అపారమైన, విస్తృత అధికారాలను కలిగి ఉంటారు. దేశానికి సంబంధించిన అన్ని విషయాలపై తుది నిర్ణయం ఆయనదే. సుప్రీం లీడర్ దేశ సైన్యానికి కమాండర్-ఇన్-చీఫ్​గా సైతం వ్యవహరిస్తారు. ఇప్పటి వరకు ఇరాన్​లో ఇద్దరు సుప్రీం లీడర్లు మాత్రమే పని చేశారు. మొదట ఆయతుల్లా రుహోల్లా ఖమేనీ సుప్రీం నాయకుడిగా వ్యవహరించారు. అనంతరం ఆ బాధ్యతలను ఆయతుల్లా అలీ ఖమేనీ చేపట్టి నాలుగు దశాబ్దాలు కొనసాగారు.

త్వరలో కొత్త నాయకుడు

ఇరాన్ చట్టం ప్రకారం వీలైనంత త్వరగా సుప్రీం లీడర్​ను ఎన్నుకోవాలి. తుది పేరు వెల్లడి అయ్యే వరకు, ఒక కౌన్సిల్ రంగంలోకి దిగి తాత్కాలికంగా నాయకత్వ విధులను నిర్వర్తిస్తుంది. దీంతో ప్రస్తుతం తాత్కాలిక సుప్రీం లీడర్​గా అరాఫీ పేరు ప్రకటించారు. 88 మంది సభ్యులతో కూడిన నిపుణుల సభ సుప్రీం లీడర్‌ను నియమిస్తుంది. అతడు షియా మతాధికారి అయి ఉండాలి.

ఇది కూడా చదవండి : Iran Dubai Doha Attacks | దుబాయ్, దోహాలపై ఇరాన్ దాడులు.. ఆందోళనకరంగా పరిస్థితి

Rupee All Time Low | భారీగా రూపాయి పతనం.. ఆల్‌టైం కనిష్ఠానికి చేరిన మారకం విలువ
Lebanon Children Killed | ఇజ్రాయెల్​ దాడిలో 100 మందికి పైగా చిన్నారులు మృతి.. లెబనాన్​ ప్రకటన
Colombia Plane Crash | కొలంబియాలో ఘోర విమాన ప్ర‌మాదం.. 80 మందికి పైగా సైనికులు మృతి
US War on Iran | మిడిల్ ఈస్ట్ యుద్ధం మరింత తీవ్రం.. ఇరాన్‌పై భారీ దాడులకు సిద్ధ‌మ‌వుతున్న అమెరికా
Emergency Helplines | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ఎమర్జెన్సీ నంబర్ల ఏర్పాటు
TAGGED:Ayatollah ArafeIranIran PoliticsIranian seminaryKhameneiMiddle EastSupreme Leadertemporary leadership
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Junior College Silver Jubilee | Junior College Silver Jubilee | ఉత్సాహంగా జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ వేడుక
Next Article Mudhiraj Leaders Felicitation | Mudhiraj Leaders Felicitation | ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తాం
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?