Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: LB Nagar Car Accident | ఎల్​బీ నగర్​లో కారు దగ్ధం.. అతివేగంతో ప్రమాదం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - LB Nagar Car Accident | ఎల్​బీ నగర్​లో కారు దగ్ధం.. అతివేగంతో ప్రమాదం

హైదరాబాద్తాజా వార్తలు

LB Nagar Car Accident | ఎల్​బీ నగర్​లో కారు దగ్ధం.. అతివేగంతో ప్రమాదం

ఎల్​బీ నగర్​లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వెళ్తూ ప్రమాదానికి గురై.. దగ్ధమైంది

Srinivas kolluri
Last updated: మార్చి 2, 2026 11:05 ఉద.
Srinivas Kolluri
4 వారాలు ago
Share
LB Nagar Car Accident
LB Nagar Car Accident

అక్షరటుడే, వెబ్​డెస్క్ : LB Nagar Car Accident | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వెళ్తూ ఓ లారీని డివైడర్​ను ఢీకొంది. అనంతరం కారు దగ్ధమైంది.

Contents
  • LB Nagar Car Accident | గచ్చిబౌలిలో..
    • LB Nagar Car Accident | మద్యం మత్తులో..

ఎల్‌బీనగర్‌లోని సాగర్ రింగ్ రోడ్డు (Sagar Ring Road) బ్రిడ్జిపై ఆదివారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాక్ టౌన్ కాలనీకి చెందిన సాయి కీర్తన్ రెడ్డి (24) తన కారులో అర్ధరాత్రి వెళ్తున్నాడు. అతివేగం, అజాగ్రత్తగా డ్రైవ్​ చేస్తూ.. సాగర్ రింగ్ రోడ్ వద్ద ఉన్న ఫ్లైఓవర్​పై లారీని ఢీకొట్టాడు. అనంతరం కారు పల్టీలు కొట్టి డివైడర్​ను, రెయిలింగ్​ను ఢీకొంది.

ఈ ఘటనలో కారులో మంటలు చెలరేగాయి. దీంతో పూర్తిగా దగ్ధమైంది. అయితే సాయికీర్తన్​ రెడ్డి ముందుగానే బయటకు రావడంతో అతడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సాయి కీర్తన్​తో పాటు కారులో మరికొందరు ఉన్నారు. ప్రమాద సమయంలో వారంతా మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

LB Nagar Car Accident | గచ్చిబౌలిలో..

నగరంలోని గచ్చిబౌలిలో శనివారం ఓ యువకుడు బెంజ్​ కారు (Benz Car)తో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. నార్సింగి పరిధిలో ఓ కారు ఢీకొన్న సదరు యువకుడు పరారయ్యాడు. సమాచారం అందుకున్న ఓ కానిస్టేబుల్ గచ్చిబౌలిలో ఆ కారును ఆపేందుకు యత్నించాడు. అయితే నిందితుడు కారును ఆపకుండా కానిస్టేబుల్​ను ఢీకొని వెళ్లాడు. దీంతో కానిస్టేబుల్​ కారు బానెట్​పై ఉండిపోయారు. ఇతర వాహనదారులు సదరు కారును ఆపి పోలీసులకు అప్పగించారు. సదరు యువకుడు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడికి కోర్టు 14 రోజుల రిమాండ్​ విధించింది.

LB Nagar Car Accident | మద్యం మత్తులో..

నగరంలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు (Road Accidents) పెరుగుతున్నాయి. ముఖ్యంగా యువత మద్యం మత్తులో అతివేగంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణం అవుతున్నారు. బెంజ్​, బీఎండబ్లూ వంటి కార్లు ఉన్న యువత స్నేహితులతో కార్లలో వెళ్తూ.. హంగామా చేస్తున్నారు. పూటుగా తాగి వాహనాలను వేగంగా నడిపిస్తూ ఇతరుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. పెద్ద కార్లలో సేఫ్టీ ఫీచర్లు బాగా ఉండటంతో.. ఇలాంటి ఘటనల్లో నిందితులు ప్రాణాలతో బయట పడుతున్నారు. అయితే వీరి మూలంగా ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇది కూడా చదవండి..: Hyderabad Traffic Relief | ట్రాఫిక్​ రద్దీ నివారణకు చర్యలు : సీపీ సజ్జనార్​

PMAY 2.0 Telangana | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. నిర్మాణాలకు కేంద్రం గ్రీన్​ సిగ్నల్​!
Sri Rama Navami | శ్రీరామ నవమి ఎప్పుడు.. పండుగ తేదీపై పండితుల స్పష్టత ఇదే!
Iran Missile Attacks | ఇరాన్ దాడులతో దద్దరిల్లిన గల్ఫ్.. ఖతార్‌లోని రస్‌లఫాన్ రిఫైనరీలపై బాంబుల వర్షం!
Maoists Surrender Telangana | లొంగిపోనున్న మావోయిస్ట్​ అగ్రనేత గణపతి!
March 24 Horoscope | పోస్టు ద్వారా అద్భుత సమాచారం.. ఈ రాశుల వారికి ఇక కొండంత సంతోషం!
TAGGED:Drunk driving HyderabadGachibowli car incidentHyderabad road accidentHyderabad traffic newsLB Nagar car accidentSagar Ring Road crashSpeeding car fireTelangana accident report
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Alipiri Walkers Protest Alipiri Walkers Protest | అలిపిరి మార్గంలో వాకర్ల ఆందోళన.. నగరవనం ప్రవేశ రుసుముపై రాస్తారోకో, ట్రాఫిక్ జామ్
Next Article Stock Market Holidays Stock Market Holidays | మార్చిలో భారీగా సెలవులు.. ఏకంగా 12 రోజులు మూసి ఉండనున్న స్టాక్ మార్కెట్లు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?