అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market Holidays | భారత స్టాక్ మార్కెట్లకు (Indian Stock Markets) మార్చి నెలలో వారాంతాలతోపాటు మూడు ప్రధాన సెలవులు ఉన్నాయి. ఈ నెలలో ఐదు ఆదివారాలు, నాలుగు శనివారాలు వచ్చాయి. వీటితోపాటు హోలీ, శ్రీరామ నవమి, మహావీర్ జయంతి సందర్భంగా బీఎసఈ, ఎనఎసఈలలో కార్యకలాపాలు జరగవు.
మార్చి 3(మంగళవారం) హోలీ, మార్చి 26 (గురువారం) శ్రీరామ నవమి, మార్చి 31 (మంగళవారం) మహావీర్ జయంతి సందర్భంగా ఆయా రోజుల్లో ఈక్విటీ, డెరివేటివ్స్, కరెన్సీ సెగ్మెంట్లలో ట్రేడింగ్ పూర్తిగా అందుబాటులో ఉండదు. ఒక నెలలో 12 రోజులపాటు స్టాక్ మార్కెట్‌కు సెలవులు రావడం అరుదైన విషయంగా భావిస్తున్నారు. సెలవులు (Holidays) పోగా మిగిలిన 19 రోజులు ట్రేడింగ్‌కు అందుబాటులో ఉంటాయి. ఇన్వెస్టర్లు తమ ట్రేడింగ్ షెడ్యూల్‌ను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Stock Market Holidays | ఆ సెగ్మెంట్‌లలో సాయంత్రం షిఫ్ట్‌లు..
హోలీతోపాటు శ్రీరామ నవమి, మహావీర్ జయంతి రోజులలో ఉదయం షిఫ్ట్‌లో కమోడిటీ డెరివేటివ్స్ సెగ్మెంట్ మరియు ఎలక్ట్రానిక్ గోల్డ్ రసీదులు (Electronic Gold Receipts) సెగ్మెంట్ ట్రేడింగ్ కూడా నిలిపివేస్తారు. అయితే సాయంత్రం షిఫ్ట్‌లో ట్రేడింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11.55 గంటల వరకు ట్రేడ్ చేయొచ్చు.

Stock Market Holidays | మార్చిలో స్టాక్ మార్కెట్ సెలవుల జాబితా..
మార్చి 01 : ఆదివారం
మార్చి 03 : మంగళవారం
మార్చి 08 : ఆదివారం
మార్చి 15 : ఆదివారం
మార్చి 22 : ఆదివారం
మార్చి 29 : ఆదివారం
మార్చి 07 : శనివారం
మార్చి 14 : శనివారం
మార్చి 21 : శనివారం
మార్చి 26 : శ్రీరామ నవమి
మార్చి 28 : శనివారం
మార్చి 31 : మహావీర్ జయంతి
ఇది కూడా చదవండి..: Stock Market Volatility | ప్రారంభ లాభాలు ఆవిరి.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

