Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Free Bus Travel | దివ్యాంగులకు గుడ్​న్యూస్​.. ఉచితంగా బస్సు ప్రయాణం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Free Bus Travel | దివ్యాంగులకు గుడ్​న్యూస్​.. ఉచితంగా బస్సు ప్రయాణం

తెలంగాణతాజా వార్తలు

Free Bus Travel | దివ్యాంగులకు గుడ్​న్యూస్​.. ఉచితంగా బస్సు ప్రయాణం

రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు గుడ్​న్యూస్​ చెప్పింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది.

Srinivas kolluri
Last updated: మార్చి 2, 2026 12:41 సా.
Srinivas Kolluri
4 వారాలు ago
Share
Free Bus Travel
Free Bus Travel

అక్షరటుడే, వెబ్​డెస్క్: Free Bus Travel | రాష్ట్ర ప్రభుత్వం (State Government) దివ్యాంగులకు గుడ్​న్యూస్​ చెప్పింది. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ జీవో జారీ చేసింది.

Contents
  • Free Bus Travel | గతంలో పాస్​లు
    • Free Bus Travel | త్వరలో స్మార్ట్​ కార్డులు
      • Free Bus Travel | టికెట్ ధరల తగ్గింపు

రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక మహాలక్ష్మి పథకం అమలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో (RTC Buses) మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు. తెలంగాణ పరిధిలో ఎక్కడకు వెళ్లినా.. పల్లెవెలుగు, ఎక్స్​ప్రెస్​ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించొచ్చు. ఈ పథకానికి భారీ స్పందన వస్తోంది. అయితే ఈ పథకాన్ని తమకు వర్తింపజేయాలని దివ్యాంగులు కొంతకాలంగా కోరుతున్నారు.

Free Bus Travel | గతంలో పాస్​లు

గతంలో దివ్యాంగులకు ప్రభుత్వం రాయితీ బస్​పాస్​లు ఇచ్చింది. ఆ పాస్​ చూయిస్తే బస్సులో 50 శాతం రాయితీ టికెట్లు ఇచ్చేవారు. అయితే రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం (Mahalaxmi Scheme) అమలుతో దివ్యాంగ మహిళలు దానిని వినియోగించుకుంటున్నారు. రాయితీ పాస్​లు తీసుకోవడం మానేశారు. అయితే తమకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని కొంతకాలంగా దివ్యాంగ పురుషులు కోరుతున్నారు. ఈ మేరకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్​ప్రెస్​ బస్సుల్లో వీరికి ఫ్రీ బస్సు అమలు చేయనున్నట్లు తెలిపింది. దీంతో దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Free Bus Travel | త్వరలో స్మార్ట్​ కార్డులు

ప్రస్తుతం మహిళలకు ఆధార్​ కార్డు, ఓటర్​ కార్డు చూసిన తర్వాత కండక్టర్లు మహాలక్ష్మి టికెట్​ ఇస్తున్నారు. మరి దివ్యాంగులకు ఎలాంటి గుర్తింపు కార్డు అడుగుతారో ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొనలేదు. సదరం సర్టిఫికెట్​ అడిగే అవకాశం ఉంది. లేదంటే ప్రత్యేక గుర్తింపు కార్డు ఇవ్వవచ్చని సమాచారం. మరోవైపు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కోసం త్వరలో స్మార్ట్​ కార్డులు జారీ చేయనుంది. ఆధార్​, ఓటర్​ కార్డులకు బదులుగా కొత్తగా ఇచ్చే స్మార్ట్​ కార్డు చూపితేనే బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించనున్నారు.

Free Bus Travel | టికెట్ ధరల తగ్గింపు

హైదరాబాద్​ నగరవాసులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. మార్చి 1 నుంచి e-మెట్రో అక్, మెట్రో డీలక్స్ బస్సుల టికెట్ రేట్లు తగ్గించింది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.

ఇది కూడా చదవండి..: Arunachalam Train Services | రెగ్యులర్​ సర్వీస్​గా నాంపల్లి – కన్యాకుమారీ వీక్లీ ఎక్స్​ప్రెస్​

Iran Qatar Missile Attack | ఖతార్​పై ఇరాన్​ 66 క్షిపణులు, 114 ష్రాప్నెల్స్​ ప్రయోగం!
London Fire Incident | లండన్​లో నిజామాబాద్​ విద్యార్థి మృతి
Iran US Tensions | జెనీవా చర్చలు విఫలం.. ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు యథాతథం!
CAPF Bill 2026 | కేంద్ర బలగాల మార్పునకు శ్రీకారం.. CAPF బిల్ 2026 రూపకల్పన!
Stock Market Volatility | ప్రారంభ లాభాలు ఆవిరి.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు
TAGGED:Disabled bus benefitsDisabled passenger supportExpress bus free travelFree bus travelMahalakshmi schemePallevelugu busesTelangana government welfareTelangana RTC news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Annaram Barrage Controversy Annaram Barrage Controversy | అన్నారం బ్యారేజీ కూల్చేందుకు కుట్ర.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు
Next Article Mahindra XUV 9E CineLux Mahindra XUV 9E CineLux | లగ్జరీ ఫీచర్లతో ‘సినీలక్స్’ లాంచ్.. బుకింగ్స్ ప్రారంభించిన మహీంద్రా
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?