అక్షరటుడే, వెబ్‌డెస్క్: Fino Bank CEO Arrest | ఫినో బ్యాంక్ CEO రిషి గుప్తాను డీజీజీఐ అధికారులు (DIG Officers) అరెస్ట్ చేశారు. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
ఆన్లైన్లో గేమింగ్ సిండికేట్పై రిషి గుప్తాను అరెస్ట్ చేశారు. ఆన్లైన్ గేమింగ్ (Online Gaming) నిర్వహణలో జీఎస్టీ ఎగ్గొట్టినట్లు అధికారులు గుర్తించారు. దీంతో కేంద్ర వస్తు సేవల పన్ను (CGST) చట్టంలోని సెక్షన్ 132(1)(a) మరియు రాష్ట్ర GST చట్టంలోని సెక్షన్ 132(1) (i) కింద అరెస్టు చేశారు. గుప్తా అరెస్ట్‌తో రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి కంపెనీ తాత్కాలిక అధిపతిగా CFO కేతన్ మెహతాను నియమించడానికి ఫినో బోర్డు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. బ్యాంక్ కార్యకలాపాలు నిరంతరాయంగా కొనసాగుతాయని, సేవలపై ఎటువంటి ప్రభావం ఉండదని బ్యాంక్ తెలిపింది.
Fino Bank CEO Arrest | పన్ను ఎగవేత ఆరోపణలపై..
ఫినో పేమెంట్స్ బ్యాంక్ (Fino Payments Bank) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) రిషి గుప్తాను పన్ను ఎగవేత ఆరోపణలపై అరెస్టు చేశారు. బ్యాంకు ద్వారా ఆన్లైన్ గేమింగ్ నిర్వహణలో GST ఎగ్గొటిన్నట్టు అధికారులు తెలిపారు. ఈ స్కాంలో 13వేల కోట్ల రూపాయల ఆన్లైన్ గేమింగ్ సిండికేట్ జరిగినట్టు గుర్తించారు. ఇందులో ఫినో బ్యాంక్ ద్వారా రూ.3 వేల కోట్ల లావాదేవీలు జరిగాయి. ఈ బ్యాంకు రూ.840 కోట్ల ట్యాక్స్ ఎగొట్టినట్లు అధికారులు తెలిపారు. కాగా సీఈవో అరెస్ట్‌తో ఫినో బ్యాంకు షేర్లు భారీగా పడిపోయాయి.
Fino Bank CEO Arrest | గతంలో సైతం..
ఫినో పేమెంట్స్ బ్యాంక్ గతంలో సైతం పలు వివాదాల్లో చిక్కుకుంది. గతేడాది అక్టోబర్‌లో సెబీ బ్యాంక్‌కు షోకాజ్ నోటీసులు (Show Cause Notices) జారీ చేసింది.ఫినో పేమెంట్స్ బ్యాంక్ తన ఉద్యోగులు మోసపూరిత పెట్టుబడి పథకాలను నిర్వహిస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. అంతేగాకుండా.. నిబంధనలు పాటించనందుకు ఫినో బ్యాంక్‌కు ఆర్బీఐ గతేడాది రూ.29.6 లక్షల జరిమానా వేసింది.
ఇది కూడా చదవండి..: HPV Vaccination Launch | హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభించిన ప్రధాని మోదీ

