అక్షరటుడే, ఇందూరు: Fee Reimbursement Dues | ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం అసోసియేషన్ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కేర్ కళాశాల (Care College)లో సోమవారం సమావేశం నిర్వహించారు.
Fee Reimbursement Dues | ఐదేళ్లుగా బకాయిలు పేరుకుపోవడంతో..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా బకాయిలు పేరుకుపోవడంతో కళాశాలల మనుగడ కష్టంగా మారిందన్నారు. ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు (Private Degree Colleges) విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని పేర్కొన్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా కళాశాలను కొనసాగిస్తున్న తమకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడం శోచనీయమన్నారు. గత కొన్ని నెలలుగా తమ కళాశాలల ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నామన్నారు.
Fee Reimbursement Dues | బకాయిలు చెల్లించకపోతే..
బకాయలు చెల్లించకపోతే కళాశాలలు మూతపడటం ఖాయమని, ప్రైవేట్ కళాశాలలో పనిచేస్తున్న వేలాదిమంది జీవితాలు రోడ్డుమీదికి వస్తాయని జైపాల్‌రెడ్డి (Jaipal Reddy) అన్నారు. ఇకనైనా తమ బాధను అర్థం చేసుకొని ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి నరాల సుధాకర్, శ్రీనివాసరాజు, సూర్య ప్రకాష్, నవీన్, సుజన్ రెడ్డి, అనిల్, హకీం, రాజేశ్వర్, సంజీవ్, దత్తు, కిషన్ రెడ్డి, దేవారెడ్డి, రాజేందర్, హరి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Holi Police Guidelines | హోలీని పురస్కరించుకొని పోలీసు నిబంధనలు పాటించాలి

