Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Black Monday to Stock Market | స్టాక్ మార్కెట్‌లో బ్లాక్ మండే.. రూ. 7.25 లక్షల కోట్ల సంపద ఆవిరి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Black Monday to Stock Market | స్టాక్ మార్కెట్‌లో బ్లాక్ మండే.. రూ. 7.25 లక్షల కోట్ల సంపద ఆవిరి

బిజినెస్​తాజా వార్తలు

Black Monday to Stock Market | స్టాక్ మార్కెట్‌లో బ్లాక్ మండే.. రూ. 7.25 లక్షల కోట్ల సంపద ఆవిరి

పశ్చిమాసియాలో చెలరేగిన ఉద్రిక్తతలతో దేశీయ స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. సెన్సెక్స్ 1,048 పాయింట్లు, నిఫ్టీ 312 పాయింట్లు కోల్పోయాయి.

Srinivas kolluri
Last updated: మార్చి 2, 2026 4:34 సా.
Srinivas Kolluri
4 వారాలు ago
Share
Black Monday to Stock Market
Black Monday to Stock Market

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Black Monday to Stock Market | అమెరికా, ఇరాన్‌ల మధ్య ఘర్షణలతో క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరలకు రెక్కలొచ్చాయి. గ్లోబల్ మార్కెట్లు (Global Markets) సైతం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీని ప్రభావం భారత మార్కెట్లపైనా కనిపించింది. సోమవారం ఉదయం సెన్సెక్స్ 2,744 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా వెంటనే 2,089 పాయింట్లు ఎగబాకింది.

Contents
  • Black Monday to Stock Market | మెటల్, ఫార్మా మినహా..
    • Black Monday to Stock Market | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

నిఫ్టీ 519 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 14 పాయింట్లు నష్టపోయింది. ఇంట్రాడే కనిష్టాలనుంచి 330 పాయింట్లు పెరిగింది. మార్కెట్ కోలుకుంటున్నట్లు కనిపించినా కొద్దిసేపటికే మళ్లీ సూచీలు పతనమయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత వాల్యూ బయ్యింగ్‌తో సూచీలు కాస్త కోలుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 1,048 పాయింట్ల నష్టంతో 80,238 వద్ద, నిఫ్టీ 312 పాయింట్ల నష్టంతో 24,865 వద్ద స్థిరపడ్డాయి.

Black Monday to Stock Market | మెటల్, ఫార్మా మినహా..

మెటల్, ఫార్మా రంగాలు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు నష్టాల బాటలో పయనించాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 0.24 శాతం, ఫార్మా 0.02 శాతం పెరిగాయి. నిఫ్టీ కన్జూమర్ డ్యూరెబుల్స్ ఇండెక్స్ 2.30 శాతం, ఆటో ఇండెక్స్ 2.20 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 2.15 శాతం, ఎనర్జీ 2.06 శాతం, యుటిలిటీ 1.86 శాతం, మీడియా 1.82 శాతం, రియాలిటీ 1.61 శాతం, పవర్ 1.56 శాతం క్షీణించగా.. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఐటీ రంగాల షేర్లు ఒక శాతానికిపైగా నష్టపోయాయి.

Black Monday to Stock Market | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 821 కంపెనీలు లాభపడగా 3,561 స్టాక్స్ నష్టపోయాయి. 146 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 94 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 869 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 6 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 9 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్ ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 7.25 లక్షల కోట్లమేర ఆవిరయ్యింది.

Black Monday to Stock Market

Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 3 కంపెనీలు లాభాలతో, 27 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. బీఈఎల్ 2.09 శాతం, సన్‌ఫార్మా 0.84 శాతం, ఐటీసీ 0.38 శాతం లాభపడ్డాయి.

Top Losers : ఇండిగో 6.25 శాతం, ఎల్‌టీ 5 శాతం, అదానిపోర్ట్స్ 3.42 శాతం, మారుతి 3.29 శాతం, ఆసియన్ పెయింట్ 2.89 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Stock Market Crash | కుదేలైన స్టాక్ మార్కెట్.. భారీ నష్టాల్లో సూచీలు

Realme Narzo Power 5G | భారీ బ్యాటరీతో రియల్‌మీ ‘పవర్’ విడుదల.. ప్రారంభ ఆఫర్‌లో రూ. 4 వేల వరకు తగ్గింపు
March 21 Horoscope | పాత పెట్టుబడుల ద్వారా లాభాల వర్షం.. ఈ రాశుల వారికి డబ్బుకు ఇక డోకా లేదు!
Hyderabad Bomb Threat | హైదరాబాద్ ఐఎండీ కార్యాలయానికి బాంబు బెదిరింపులు
Stock Market Losses | తగ్గని ఉద్రిక్తతలు.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
Iran Israel War UPDATES | మోజ్తాబా ఎన్నిక.. ఇరాన్​ యుద్ధంపై ట్రంప్​ కీలక వ్యాఖ్యలు
TAGGED:BSE NSE updateCrude OilGlobal MarketsIndian stock market newsInvestor wealth loss IndiaMarket selloff todaySensex Nifty crashShare market volatilityStock Market Black MondayUS Iran impact markets
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Fee Reimbursement Dues Fee Reimbursement Dues | ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలను విడుదల చేయాలి
Next Article Bandi Sanjay Allegations Bandi Sanjay Allegations | ఎంఐఎం మెప్పు కోసమే అరెస్టులు, దాడులు: కేంద్రమంత్రి బండి సంజయ్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?