Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Ramchander Rao Allegations | ఎంఐఎంను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Ramchander Rao Allegations | ఎంఐఎంను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

నిజామాబాద్

Ramchander Rao Allegations | ఎంఐఎంను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

బీజేపీని ఎదుర్కొనే దమ్ములేక బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీజేపీపై దాడికి ఎంఐఎంను ప్రోత్సహిస్తున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. కామారెడ్డిలో ఆయన మాట్లాడారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 2, 2026 8:59 సా.
Shashi kiran Mottala
4 వారాలు ago
Share
Ramchander Rao Allegations |

అక్షరటుడే, కామారెడ్డి: Ramchander Rao Allegations | బీజేపీని ఎదుర్కొనే దమ్ములేక బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీజేపీపై దాడికి ఎంఐఎంను ప్రోత్సహిస్తున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) విమర్శించారు. కామారెడ్డి (Kamareddy) పట్టణంలోని పర్ణిక ప్యాలెస్​లో సోమవారం నిర్వహించిన కరీంనగర్ జోనల్ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ కార్యశాల కార్యక్రమంలో పాల్గొన్నారు.

Contents
  • Ramchander Rao Allegations | ప్రజాస్వామ్యాన్ని గాలికి వదిలేశారు..
    • Ramchander Rao Allegations | ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​పై దాడి..
    • Ramchander Rao Allegations | కాంగ్రెస్​ సమాధానం చెప్పాలి..

Ramchander Rao Allegations | ప్రజాస్వామ్యాన్ని గాలికి వదిలేశారు..

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాంచందర్​రావు మాట్లాడుతూ.. కామారెడ్డి జిల్లాలో కొద్దిరోజులుగా ఉద్రిక్త వాతావరణం (BRS political controversy) నెలకొందన్నారు. ప్రజాస్వామ్యాన్ని(BJP Telangana news) ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. కామారెడ్డి, బాన్సువాడ వెళ్తామంటే వెళ్లనివ్వలేదని, ప్రస్తుతం కామారెడ్డి పట్టణంలో రోడ్డు పక్కన సమావేశం ఉందని రావడానికి పోలీసులు అనుమతిచ్చారని తెలిపారు. కామారెడ్డి ఎమ్మెల్యే ఇంట్లో బీజేఎల్పీ సమావేశం తర్వాత ఎమ్మెల్యేలు బాన్సువాడకు వెళ్తే మధ్యలో అరెస్ట్ చేశారన్నారు. తమ ఎమ్మెల్యే వద్దకే తాము రాలేని పరిస్థితి ఉందని, బాన్సువాడలో బాధితులను కలవడానికి ఒప్పుకోరని, రుద్రూర్​లో మహిళా న్యాయవాదిపై దాడి జరిగితే కలవడానికి అనుమతి ఇవ్వకపోవడంతో రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు.

Ramchander Rao Allegations | ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​పై దాడి..

కాంగ్రెస్ ఆరోపణలు చేస్తే ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డిపై(MLA Venkata Ramana Reddy) నిజాలు మాట్లాడదాం అని సవాలు చేశారని, సవాలును స్వీకరించకుండా ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయంపై కాంగ్రెస్ దాడి చేసిందన్నారు. ఎమ్మెల్యేపై దాడికి పాల్పడాల్సిన అవసరం ఏముందని, చర్చకు రమ్మంటే దాడి చేస్తారా అని ప్రశ్నించారు. బాన్సువాడ (banswada) పట్టణంలోని షాపింగ్ మాల్​లో మహిళా కార్మికురాలితో అసభ్యంగా ప్రవర్తించారని తెలిపారు. ఆ సమయంలో పోలీసులు మౌనం ప్రదర్శించారని, 37 మంది హిందువులపై కేసులు నమోదు చేసి 20 మందిని జైలుకు పంపారని ఆరోపించారు. ఎంఐఎం వాళ్లపై కేసులు నమోదు చేశామని చెబుతున్నా వాళ్లు మాత్రం బయట గాలికి తిరుగుతున్నారని తెలిపారు. ఎంఐఎంను కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రోత్సహించినంత కాలం ఆలయాలపై, హిందువులపై దాడులు జరుగుతూనే ఉంటాయన్నారు.

Ramchander Rao Allegations | కాంగ్రెస్​ సమాధానం చెప్పాలి..

రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి వాతావరణం సృష్టించిన కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని రాంచందర్​రావు డిమాండ్ చేశారు. ఇవాళ రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చారని, రూ.వెయ్యి కోట్ల కోసం రాహుల్ గాంధీ ఎందుకు వచ్చారని, ఇక్కడున్న నాయకులు పంపించలేక పోయారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో విశ్రాంత ఉద్యోగులకు బకాయిలు, ఆరు గ్యారెంటీలు, రైతులకు భరోసా నిధులు, ఆరోగ్యశ్రీ సేవలు ఎందుకు ఇవ్వడం లేదని సీఎం రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. అప్పుడే రాహుల్ గాంధీ తెలంగాణకు రావడానికి నైతికత ఉంటుందని, లేకపోతే ఇవాళ వచ్చిన పర్యటన అనైతికమైందిగా అభివర్ణించారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కళ్యాణ్ నాయక్, జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు, నాయకులు పైడి ఎల్లారెడ్డి, మురళీధర్ గౌడ్, రంజిత్ మోహన్, మోటూరి శ్రీకాంత్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Bandi Sanjay Allegations | ఎంఐఎం మెప్పు కోసమే అరెస్టులు, దాడులు: కేంద్రమంత్రి బండి సంజయ్

Life Sciences Seminar | నిత్య నూతనం.. శాస్త్రీయ దృక్పథం..
Paidi Rakesh Reddy Unity | ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యం..: ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
SSC Exam Rules | ఎస్సెస్సీ పరీక్షల్లో నిర్లక్ష్యం చేస్తే.. సస్పెన్షన్​ కంటే కఠినచర్యలు: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
Kamareddy Municipal Chairperson | సమాజ సేవలో ముందుండాలి.. కామారెడ్డి మున్సిపల్ ఛైర్​పర్సన్​
Eye Camp to Drivers | డ్రైవర్లకు కంటి చూపు చాలా ముఖ్యం : ఎస్పీ రాజేష్ చంద్ర
TAGGED:BanswadaBJP Telangana newsBRS political controversyCongress vs BJPKamarreddy BJP meetingMIM support allegationsMLA Venkata Ramana ReddyRahul Gandhi Telangana visitRamchander Rao statementTelangana political news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Sarpanch Training Program | Sarpanch Training Program | సర్పంచులకు శిక్షణ ప్రారంభం
Next Article Hydraa Saves Land Hydraa Saves Land | రూ.600 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?