Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Crude Oil Prices | క్రూడాయిల్ ధరలపై యుద్ధ ప్రభావం.. భారత్​పై పెను భారం!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Crude Oil Prices | క్రూడాయిల్ ధరలపై యుద్ధ ప్రభావం.. భారత్​పై పెను భారం!

అంతర్జాతీయంజాతీయంతాజా వార్తలుబిజినెస్​

Crude Oil Prices | క్రూడాయిల్ ధరలపై యుద్ధ ప్రభావం.. భారత్​పై పెను భారం!

మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఇరాన్ చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ చమురు మార్కెట్లను కుదిపేస్తున్నాయి. కీలక సముద్ర మార్గమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ తాత్కాలికంగా మూసివేసినట్టు వచ్చిన సమాచారం ప్రపంచ దేశాల్లో ఆందోళన రేకెత్తించింది.

Naresh chandan
Last updated: మార్చి 2, 2026 11:30 సా.
Naresh chandan
4 వారాలు ago
Share
Crude Oil Prices | క్రూడాయిల్ ధరలపై యుద్ధ ప్రభావం.. భారత్​పై పెను భారం!
Crude Oil Prices | క్రూడాయిల్ ధరలపై యుద్ధ ప్రభావం.. భారత్​పై పెను భారం!

అక్షరటుడే, న్యూఢిల్లీ: Crude Oil Prices | ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు మూడో వంతు హర్మూజ్ జలసంధి Strait of Hormuz మీదుగానే రవాణా అవుతోంది. ఇరాన్​ యుద్ధంతో ఇక్కడ ఏర్పడిన అంతరాయం వల్ల చమురు రవాణా నౌకలపై దాడులు జరుగుతున్నాయనే వార్తలు మార్కెట్లను కలవరపెడుతున్నాయి. ఫలితంగా అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. దీంతో ఏప్రిల్ కాంట్రాక్ట్ ధరలు బ్యారెల్‌కు సుమారు 10 శాతం పెరిగినట్లు ట్రేడింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Contents
  • Crude Oil Prices | భారత్‌పై ప్రభావం భారీగానే..
    • Crude Oil Prices | గ్లోబల్ మార్కెట్ల కలకలం
      • తీవ్ర ఆందోళన

Crude Oil Prices | భారత్‌పై ప్రభావం భారీగానే..

భారత దేశం తన అవసరాల్లో దాదాపు 85 శాతం ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్​ ఆయిల్​ ధరలు పెరగడం వల్ల నేరుగా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపనుంది. నిపుణుల అంచనాల ప్రకారం పరిశీలిస్తే.. బ్యారెల్ ధరలో ఒక్క డాలర్  పెరిగినా భారత దేశంపై ఏటా సుమారు రూ.13 వేల కోట్ల అదనపు భారం పడే ప్రమాదం ఉంది.

చమురు ధరల పెరుగుదల వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయి. దీంతో రవాణా ఖర్చులు కూడా పెరుగుతాయి. తద్వారా నిత్యావసర సరకులు, కూరగాయలు, పారిశ్రామిక ఉత్పత్తుల ధరలు సైతం పెరగవచ్చు. దీంతో మళ్లీ ద్రవ్యోల్బణం సమస్య తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Crude Oil Prices | గ్లోబల్ మార్కెట్ల కలకలం

చమురు ధరల పెరుగుదలతో స్టాక్ మార్కెట్లు ప్రతికూలంగా స్పందిస్తున్నాయి. పెట్టుబడిదారులు భద్రమైన పెట్టుబడుల వైపు మొగ్గుచూపుతున్నారు. యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం ఉండటంతో మార్కెట్లలో నిరంతరం అస్థిరత కొనసాగవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

తీవ్ర ఆందోళన

చమురు ధరలు పెరగడంతో సామాన్య ప్రజలపై భారీగానే భారం పడవచ్చనే చర్చలు ఇప్పటికే కొనసాగుతున్నాయి. ఇంధన ధరలు పెరిగితే అన్ని రంగాలపై ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది.

మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు చల్లారకపోతే అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై ఏ విధంగా పడబోతుందనే దానిపై ఆందోళన నెలకొంది.

Hyderabad Rotten Chicken | కుళ్లిన చికెన్.. బార్లు, వైన్​ షాపులకు సప్లై
Arunachalam Train Services | రెగ్యులర్​ సర్వీస్​గా నాంపల్లి – కన్యాకుమారీ వీక్లీ ఎక్స్​ప్రెస్​
India Petrol Shortage | దేశంలో పెట్రోల్‌ కొరత లేదు.. కేంద్రం కీలక ప్రకటన
Deepa Aradhana Significance | హిందూ సంప్రదాయంలో దీపారాధన ఆనవాయితీ.. ఆ రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Stock Market Crash | కుదేలైన స్టాక్ మార్కెట్.. భారీ నష్టాల్లో సూచీలు
TAGGED:crude oil pricesenergy crisis newsfuel price hikeglobal oil marketHormuz Strait CrisisIndia Oil Importsinflation impact IndiaMiddle East war
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Rajma Health Benefits | మాంసాహారానికి ప్రత్యామ్నాయం.. ప్రొటీన్‌కు రారాజు రాజ్మా Rajma Health Benefits | మాంసాహారానికి ప్రత్యామ్నాయం.. ప్రొటీన్‌కు రారాజు రాజ్మా
Next Article Vijay Deverakonda Scholarships | విజయ్​ దేవరకొండ కీలక నిర్ణయం.. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు! Vijay Deverakonda Scholarships | విజయ్​ దేవరకొండ కీలక నిర్ణయం.. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు!
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?