Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: T20 World Cup 2026 Semifinal Rain | సెమీఫైనల్స్‌కి వర్షం ముప్పు ఉందా.. మ్యాచ్ రద్దైతే ఫైనల్‌కి ఎవరు?
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రీడలు - T20 World Cup 2026 Semifinal Rain | సెమీఫైనల్స్‌కి వర్షం ముప్పు ఉందా.. మ్యాచ్ రద్దైతే ఫైనల్‌కి ఎవరు?

క్రీడలు

T20 World Cup 2026 Semifinal Rain | సెమీఫైనల్స్‌కి వర్షం ముప్పు ఉందా.. మ్యాచ్ రద్దైతే ఫైనల్‌కి ఎవరు?

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్ మ్యాచ్‌లపై వర్షం ప్రభావం ఉంటే ఫలితం ఎలా తేల్చుతారనే అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 3, 2026 10:43 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
3 వారాలు ago
Share
T20 World Cup 2026 Semifinal Rain
T20 World Cup 2026 Semifinal Rain

అక్షరటుడే, వెబ్​డెస్క్: T20 World Cup 2026 Semifinal Rain | ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 (ICC T20 World Cup 2026) తుది దశకు చేరుకుంది. మరో మూడు నాకౌట్ మ్యాచ్‌లతో ఈ మెగా టోర్నీకి తెరపడనుంది. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి.

Contents
  • T20 World Cup 2026 Semifinal Rain | వర్షం వస్తే ఏం జరుగుతుంది?
    • T20 World Cup 2026 Semifinal Rain | ఇంగ్లండ్ నేరుగా ఫైనల్‌

బుధవారం (మార్చి 4) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్  (Eden Gardens) వేదికగా తొలి సెమీఫైనల్‌లో న్యూజిలాండ్–సౌతాఫ్రికా తలపడనున్నాయి. గురువారం (మార్చి 5) ముంబైలోని వాంఖ‌డే స్టేడియం (Wankhede Stadium)లో భారత్–ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది.

T20 World Cup 2026 Semifinal Rain | వర్షం వస్తే ఏం జరుగుతుంది?

ప్రస్తుతం వాతావరణం అనుకూలంగానే ఉన్నప్పటికీ, మ్యాచ్ సమయానికి వర్షం అంతరాయం కలిగిస్తే ఏం జరుగుతుందనే ప్రశ్న అభిమానులను కలవరపెడుతోంది. ముఖ్యంగా నాకౌట్ మ్యాచ్ కావడంతో ఒక బంతి కూడా పడకపోతే పరిస్థితి ఎలా ఉంటుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కీలక మ్యాచ్‌లకు ఐసీసీ రిజర్వ్ డే (ICC Reserve Day) కేటాయించింది. మ్యాచ్ పూర్తికాకపోతే లేదా మధ్యలో ఆగిపోతే, మరుసటి రోజు అదే స్థితి నుంచి ఆటను కొనసాగిస్తారు. అంటే మొదటి రోజు ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే రిజర్వ్ డేలో మ్యాచ్ కొనసాగుతుంది.

T20 World Cup 2026 Semifinal Rain | ఇంగ్లండ్ నేరుగా ఫైనల్‌

అయితే వర్షం కారణంగా రిజర్వ్ డే కూడా పూర్తిగా దెబ్బతింటే పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం, నాకౌట్ దశలో మ్యాచ్ ఫలితం రాకపోతే సూపర్-8 దశ ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో నిలిచిన జట్టుకే ఫైనల్ టికెట్ లభిస్తుంది. గ్రూప్-1లో సౌతాఫ్రికా టాప్‌గా నిలిచింది. గ్రూప్-2లో న్యూజిలాండ్ రన్నరప్‌గా ముగించింది. కాబట్టి సౌతాఫ్రికా–న్యూజిలాండ్ మ్యాచ్ వర్షంతో రద్దైతే సౌతాఫ్రికా (South Africa) ఫైనల్ చేరుతుంది. గ్రూప్-2లో ఇంగ్లండ్ అగ్రస్థానంలో నిలిచింది. గ్రూప్-1లో భారత్ రన్నరప్‌గా సెమీస్ చేరింది. ఈ నేపథ్యంలో భారత్–ఇంగ్లండ్ మ్యాచ్ పూర్తిగా రద్దైతే ఇంగ్లండ్ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. భారత్ మ్యాచ్ ఆడకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది.

ఈ పరిస్థితుల్లో భారత అభిమానులు వర్షం వ‌ల‌న‌ అంతరాయం కలగకూడదని కోరుకుంటున్నారు. ముఖ్యంగా నాకౌట్ దశలో మ్యాచ్ రద్దు కావడం జట్టు భవితవ్యాన్ని నిర్ణయించే పరిస్థితి రావడం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది.

ఇది కూడా చదవండి..: India T20 Semifinal | కరేబియన్​ జట్టుపై ఘన విజయం.. సెమీ ఫైనల్​లోకి భారత్​

Sri Lanka Defeat | ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో లంకకి ఘోర‌ అవమానం… 19 ఏళ్ల టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇదో చెత్త రికార్డు
Suryakumar Yadav Retirement | సూర్య‌కుమార్ రిటైర్ కాబోతున్నాడంటూ ప్ర‌చారాలు.. ఇన్‌డైరెక్ట్‌గా క్లారిటీ ఇచ్చిన టీ20 కెప్టెన్
Saketh Myneni Deputy Collector | టెన్నిస్ స్టార్‌కి డిప్యూటీ కలెక్టర్ పదవి.. క్రికెటర్ శ్రీచరణికి నజరానా
T20 World Cup Semifinals | టీ20 వరల్డ్ కప్ సెమీస్ సమరం.. సౌతాఫ్రికా-న్యూజిలాండ్ ఢీ, ఇంగ్లాండ్ ప్రత్యర్థి ఎవ‌రో?
T20 World Cup 2026 | టీ20 వరల్డ్‌కప్‌లో చరిత్ర సృష్టించిన‌ భారత్.. న‌మోదైన రికార్డులు ఇవే..!
TAGGED:Eden GardensICC Reserve DaySouth AfricaT20 World Cup 2026 Semifinal RainWankhede Stadium
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Bahrain Protests Bahrain Protests | బహ్రెయిన్​లో చెలరేగిన అల్లర్లు
Next Article Chandra Grahan Temple Closure  Chandra Grahan Temple Closure | చంద్రగ్రహణం.. పలు ఆలయాల మూసివేత
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?