అక్షరటుడే, వెబ్‌డెస్క్: Chandra Grahan Temple Closure | సంపూర్ణ చంద్ర గ్రహణం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలను అర్చకులు మూసి వేశారు. మంగళవారం మధ్యాహ్నం 3.21గంటలకు గ్రహణం ప్రారంభం కానుంది.
రాత్రి 7:52 గంటల వరకు కొనసాగనుంది. చంద్రగ్రహణం నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలను మూసివేశారు. ఆలయాలను శుద్ధి చేసిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించనున్నారు.
Chandra Grahan Temple Closure | శ్రీవారి ఆలయం
ప్రముఖ పుణ్యక్షేత్రాలైన శ్రీశైలం, మహానంది, కాణిపాకం (Kanipakam), యాదగిరిగుట్ట (Yadagirigutta) తదితర ఆలయాలు మూసివేశారు. తిరుమల శ్రీవారి ఆలయాన్ని సైతం తాత్కాలికంగా మూసివేశారు. దాదాపు పదిన్నర గంటల పాటు ఆలయం మూసి ఉండనుంది. ఉదయం 9 గంటలకు ఆలయ ద్వారాలను టీటీడీ అధికారులు (TTD Officers) మూసివేశారు. రాత్రి 7:30 గంటలకు తిరిగి తెరవనున్నారు. అనంతరం ఆలయ శుద్ధి కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత రాత్రి 8.30 గంటల నుంచి భక్తులకు దర్శనాలు కల్పించనున్నారు.

Chandra Grahan Temple Closure | భక్తులకు సూచనలు
గ్రహణం ఎఫెక్ట్‌తో టీటీడీ నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ కేంద్రాలు కూడా తాత్కాలికంగా అధికారులు మూసివేశారు. ఆలయం మూసివేతతో దర్శనం సమయాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో భక్తులు (Devotees) ముందస్తుగా సమాచారం తెలుసుకొని దర్శనానికి రావాలని అధికారులు సూచించారు.
ఇది కూడా చదవండి..: Partial Lunar Eclipse | చంద్రగ్రహణం.. పాక్షికమే!

