అక్షరటుడే, వెబ్‌డెస్క్: Shivaji Raja Father Death | తెలుగు సినీ పరిశ్రమ (Telugu Film Industry)లో సుదీర్ఘకాలంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటుడు శివాజీ రాజా కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ఆయన తండ్రి జి. రామరాజు (85) మంగళవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మధురానగర్ (Mathuranagar)లోని స్వగృహంలో ఉదయం సుమారు 8 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Shivaji Raja Father Death | జూబ్లీహిల్స్‌లో అంత్యక్రియలు
రామరాజు మృతదేహాన్ని చివరి దర్శనార్థం ఇంటి వద్ద ఉంచి, మధ్యాహ్నం 3 గంటలలోపు మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు శివాజీ రాజా కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నారు. 1962 ఫిబ్రవరి 26న ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని భీమవరంలో జన్మించిన శివాజీ రాజా తండ్రి రామరాజు అక్కడి డి.ఎన్.ఆర్ కాలేజీలో అటెండర్‌గా పనిచేశారు. నటనపై ఆసక్తితో శిక్షణ పొందిన శివాజీ రాజా తరువాత కుటుంబంతో కలిసి చెన్నైకి వెళ్లి సినీ రంగ ప్రవేశం చేశారు. 1985లో విడుదలైన కళ్లు చిత్రంతో తెలుగు తెరపై అడుగుపెట్టిన ఆయనకు తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమాకు ఉత్తమ నూతన నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. అనంతరం హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ప్రతినాయక పాత్రల్లోనూ తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.
Shivaji Raja Father Death | దాదాపు మూడు దశాబ్దాలకు పైగా
దాదాపు మూడు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో శివాజీ రాజా 400కు పైగా సినిమాలు, అనేక టీవీ సీరియల్స్‌లో నటించారు. పెళ్లి సందడి, సిసింద్రి, ఘటోత్కచుడు, మురారి వంటి చిత్రాల్లో ఆయన చేసిన పాత్రలు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. టెలివిజన్ రంగంలో అమృతం సీరియల్ (Amrutham Serial)లో ఆయన పోషించిన పాత్ర విశేష ప్రజాదరణ పొందింది. అలాగే వివిధ వినోద కార్యక్రమాల ద్వారా కూడా ప్రేక్షకులకు చేరువయ్యారు. ‘మెగుడ్స్ పెళ్లామ్స్’ సినిమాతో హీరోగానూ నటించి తన వైవిధ్యాన్ని చాటుకున్నారు. కేవలం నటుడిగానే కాకుండా పరిశ్రమకు సేవలందిస్తూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (Movie Artists Association) (మా) అధ్యక్షుడిగానూ శివాజీ రాజా బాధ్యతలు నిర్వహించారు. తన ప్రత్యేక హాస్యశైలి, సహజ నటనతో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు.
ఇది కూడా చదవండి..: Vijay Rashmika Wedding | పెళ్లి ఫొటోలు పంచుకున్న రష్మిక

