అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Trump Iran War Comments | ఇరాన్పై యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తామన్నారు.
ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు (American Attacks) చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఇరాన్ ప్రతిదాడులకు దిగుతోంది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్‌లో చెత్తను ఏరివేస్తున్నామని.. బయటికి రావొద్దని అమెరికా ప్రజలకు సూచించారు. తాము ఇంకా యుద్ధాన్ని ఉధృతం చేయలేదని, త్వరలోనే ఉధృతం చేస్తామని ప్రకటించారు. యుద్ధం మరో నాలుగైదు వారాలు కొనసాగవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. అరబ్ దేశాలపై ఇరాన్ (Iran) దాడి చేయడం ఆశ్చర్యం కలిగించిందన్న పేర్కొన్నారు.
Trump Iran War Comments | వదిలిపెట్టం
తమ జోలికి ఎవరొచ్చినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ట్రంప్ హెచ్చరించారు. ప్రపంచంలోనే అమెరికా అత్యంత శక్తివంతమైన దేశం అన్నారు. ఇరాన్ క్షిపణి సామర్థ్యాన్ని ధ్వంసం చేయడం, నౌకాదళాన్ని నాశనం చేయడం, అణ్వాయుధాలు తయారు చేయకుండా అడ్డుకోవడం తమ లక్ష్యమన్నారు. ఇరాన్ ప్రభుత్వంలోని చాలా మంది తమ ప్రాణాలను కాపాడుకోవడానికి లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారని ట్రంప్ అన్నారు.
Trump Iran War Comments | చాలా దేశాలు ఉన్నాయి
ఇరాన్పై ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులు (Israeli Airstrikes) మాత్రమే చేస్తున్నాయి. త్వరలో భూతల దాడులు ప్రారంభిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ క్షిపణి వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసేదాకా నిద్రపోనని తెలిపారు. తమ వెనక చాలా దేశాలు ఉన్నాయన్నారు. కొన్ని దేశాలు బహిరంగ మద్దతు ప్రకటించడం లేదని చెప్పారు.
Trump Iran War Comments | ఇరాన్ బాంబుల వర్షం
గల్ఫ్లో అమెరికన్ మిత్ర దేశాలపై ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ దాడుల్లో 40 మందికి పైగా అమెరికన్ సైనికులు చనిపోయినట్లు ఇరాన్ ప్రకటించింది. గల్ఫ్ షిప్పింగ్ (Gulf Shipping) జరగకుండా చేస్తామని హెచ్చరించింది. ఇప్పటికే దుబాయి (Dubai)లో బిజినెస్‌ను ఇరాన్ దెబ్బకొట్టింది. ఇజ్రాయెల్ ఎయిర్ బేస్‌ను నాశనం చేశామని ప్రకటించింది.
ఇది కూడా చదవండి..: Crude Oil Prices | క్రూడాయిల్ ధరలపై యుద్ధ ప్రభావం.. భారత్‌పై పెను భారం!

