అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PV Sindhu Returns | భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు భారత్‌కు చేరుకున్నారు. దుబాయిలో చిక్కుకున్న ఆమె మంగళవారం ఉదయం బెంగళూరుకు వచ్చారు.
గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దుబాయి ఎయిర్‌పోర్టుపై కూడా దాడి జరిగింది. దీంతో అధికారులు ఎయిర్‌పోర్టును మూసివేశారు. అయితే దుబాయి నుంచి పలు దేశాలకు వెళ్లాల్సిన వారు అక్కడే చిక్కుకుపోయారు. పీవీ సింధు సైతం దుబాయి ఎయిర్‌పోర్టు (Dubai Airport)లో స్టక్ అయ్యారు. ఈ క్రమంలో తమకు సమీపంలో బాంబు పేలుడు చోటు చేసుకుందని, భయంతో పరుగులు తీసినట్లు ఆమె రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అనంతరం అధికారులు ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించారు.
PV Sindhu Returns | విమానాలు ప్రారంభం
దుబాయి నుంచి మంగళవారం ఉదయం విమానాల రాకపోకలు ప్రారంభం అయ్యాయి. దీంతో పీవీ సింధు (PV Sindhu) ఇండియాకు చేరుకున్నారు. సురక్షితంగా వచ్చానని ట్వీట్ చేశారు. తొలుత విశ్రాంతి తీసుకుని తర్వాత భవిష్యత్తు ప్లాన్స్‌పై దృష్టి పెడతామన్న పేర్కొన్నారు. తనకు ఈ క్లిష్ట పరిస్థితుల్లో సహకరించిన దుబాయి అధికారులు, ఎయిర్‌పోర్ట్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
PV Sindhu Returns | భారతీయుల తరలింపు
UAE నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియ మొదలైంది. అక్కడ చిక్కుకున్న వారిని విమానాల్లో ఇండియా (India)కు తీసుకు వస్తున్నాయి. అబుదాబి నుంచి ఎతిహాద్ ఎయిర్ లైన్స్ ఢిల్లీకి చేరింది. ఇందులో 300 మంది భారతీయుల వచ్చారు. ఇప్పటి వరకు నాలుగు విమానాలు భారతీయులను తీసుకొచ్చాయి. మూడు రోజుల విరామం తర్వాత విమాన సర్వీసులు ప్రారంభం కావడంతో చాలా మంది భారత్ రావడానికి యత్నిస్తున్నారు.

PV Sindhu Returns | కేంద్రం చర్యలు
గల్ఫ్‌లో చిక్కుకున్న ఇండియన్స్ కోసం కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జెడ్డా నుంచి మంగళవారం 10 ప్రత్యేక విమానాలను ఇండిగో (Indigo) నడపనుంది. UAEలో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు పుజైరా నుంచి ఢిల్లీ, ముంబై, కొచ్చికి 4 స్పెషల్ స్పైస్ జెట్ ఫ్లైట్స్ రానున్నాయి.
ఇది కూడా చదవండి..: RK Roja Tamil Nadu | తమిళనాట ఎన్నికల వేడి.. స్టాలిన్‌కు మద్దతుగా ఆర్కే రోజా ప్రచారం, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు

