అక్షరటుడే, వెబ్‌డెస్క్: Lahore US Consulate Attack | పాకిస్థాన్‌లోని లాహోర్‌లో గల అమెరికా కాన్సులేట్ కార్యాలయం (American Consulate Office)పై దాడి జరిగింది. భారీ ఎత్తున నిరసనకారులు తరలి వచ్చి ఆఫీసుపై దాడి చేశారు.
ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం పాకిస్థాన్‌తో ఆందోళనకు కారణమైంది. అమెరికా (America), ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందడంతో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ముస్లింలు నిరసన తెలుపుతున్నారు. ఖమేనీకి మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పాకిస్థాన్‌లో సైతం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. సోమవారం కరాచీలోని యూఎస్ కాన్సులేట్‌పై నిరసనకారులు దాడి చేశారు. అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేసి కార్యాలయానికి నిప్పు పెట్టారు. ఈ సందర్భంగా కాన్సులేట్ సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
Lahore US Consulate Attack | లాహోర్‌లో..
లాహోర్ (Lahore)లోని యూఎస్ కాన్సులేట్‌పై తాజాగా మూక దాడి జరిగింది. వందలాదిగా తరలి వచ్చిన యువకులు కాన్సులేట్‌పై దాడి చేశారు. కార్యాలయానికి నిప్పు పెట్టారు. లాహోర్‌తో పాటు పాక్‌లోని అమెరికా దౌత్య కార్యాలయాల వద్ద నిరసనలు కొనసాగుతున్నాయి. పోలీసులు గార్డులతో జనాలు ఘర్షణ పడటంతో 10 మందికి పైగా మరణించారు. చాలా మంది గాయపడ్డారు. దీంతో పోలీసులు చర్యలు చేపట్టారు. పాక్‌లోని యూఎస్ కాన్సులేట్ కార్యాలయ సమీపంలో కర్ఫ్యూ విధించారు. పెద్ద ఎత్తున దళాలను మోహరించారు.
Lahore US Consulate Attack | ఇరాన్‌లో 787 మంది మృతి
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ఇంకా చేపడుతూనే ఉన్నాయి. దాడుల్లో ఇప్పటి వరకు 787 మంది వరకు మృతి చెందినట్లు ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ తెలిపింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో వాణిజ్య విమానాలకు తమ గగనతలాన్ని మూసి వేస్తున్నట్లు పాకిస్థాన్ (Pakistan) తెలిపింది. ఈ నెల చివరి వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని తెలిపింది.
ఇది కూడా చదవండి..: Trump Iran War Comments | యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తాం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

