అక్షరటుడే, ఇందూరు: Society Name Forgery |చిట్టిమీల హరిప్రసాద్ జూనియర్ కళాశాల పేరును ఫోర్జరీ చేసి సభ్యుల అనుమతి లేకుండా పేరు మార్చిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని శ్రీ నూతన వైశ్య పాఠశాల కమిటీ సభ్యులు కోరారు.
Society Name Forgery | సీపీకి ఫిర్యాదు
ఫోర్జరీపై పోలీస్ కమిషనర్ సాయి చైతన్యకు సభ్యులు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. చిట్టిమిల్లా హరిప్రసాద్ జూనియర్ కళాశాలను నడపడానికి 2021లో ఎథికెన్ ఎడ్యుకేషన్ సొసైటీకి అప్పజెప్పామన్నారు. ఎటువంటి పేరు మార్పులు లేకుండా కొనసాగించాలని సూచించామన్నారు. అయితే తమకు తెలియకుండా తమ సంతకాలను ఫోర్జరీ చేసి, తమ లెటర్ హెడ్‌ను దుర్వినియోగం చేసి షాహిద్ జూనియర్ కళాశాలగా మార్చారన్నారు. చట్ట విరుద్ధంగా చేసిన ఈ అంశాన్ని పరిశీలించి, పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇది కూడా చదవండి..: AR Constable Complaint | ఏఆర్ కానిస్టేబుల్ ప్రసాద్‌రావుపై ఫిర్యాదు

