Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Middle East Oil Crisis | మధ్యప్రాచ్యంలో యుద్ధం.. ఇంధన ధరల పెంపుపై కేంద్రం స్పష్టత..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Middle East Oil Crisis | మధ్యప్రాచ్యంలో యుద్ధం.. ఇంధన ధరల పెంపుపై కేంద్రం స్పష్టత..

జాతీయంతాజా వార్తలు

Middle East Oil Crisis | మధ్యప్రాచ్యంలో యుద్ధం.. ఇంధన ధరల పెంపుపై కేంద్రం స్పష్టత..

మధ్యప్రాచ్యంలో రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. యుద్ధం తీవ్రం కావడంతో చమురు ధరలు ఆకాశానంటుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్​లో ఇంధన ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 3, 2026 6:44 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
3 వారాలు ago
Share
Middle East Oil Crisis

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Middle East Oil Crisis | మధ్యప్రాచ్యంలో రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. యుద్ధం తీవ్రం కావడంతో చమురు ధరలు ఆకాశానంటుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్​లో ఇంధన ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. దేశంలో ప్రస్తుతం 25 రోజుల వరకు క్రూడ్ ఆయిల్, శుద్ధి చేసిన ఇంధనాల నిల్వలు ఉన్నాయని పేర్కొంది. భౌగోళిక-రాజకీయ కారణాల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ఆయిల్ ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ, పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణం పెంచే యోచన లేదని స్పష్టం చేసింది.

Contents
  • Middle East Oil Crisis | పెరుగుతున్న బ్రెంట్ క్రూడ్ ధరలు
    • Middle East Oil Crisis | మధ్యప్రాచ్య దేశాల నుంచి..
    • Middle East Oil Crisis | ప్రపంచం మూడో అతిపెద్ద దిగుమతిదారు
      • Middle East Oil Crisis | భారత్ ప్రత్యామ్నాయ వ్యూహాలు

Middle East Oil Crisis | పెరుగుతున్న బ్రెంట్ క్రూడ్ ధరలు

అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు సుమారు 80 డాలర్ల సమీపంలోకి చేరింది. ఇరాన్ సంక్షోభం మొదలైనప్పటి నుంచి దాదాపు 10 శాతం పెరిగింది. అలాగే ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఆయిల్ రవాణా మార్గమైప హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం వల్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీని ప్రభావం ఆయిల్ దిగుమతిపై ఆధారపడిన భారత్​ వంటి దేశాలపై పడనుంది. దిగుమతి ఖర్చులు పెరగడం వల్ల ఆర్థిక భారం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

Middle East Oil Crisis | మధ్యప్రాచ్య దేశాల నుంచి..

భారత్​ తనకు అవసరమైన క్రూడ్ ఆయిల్‌లో 88 శాతం వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇందులో 50 శాతానికి పైగా మధ్యప్రాచ్య దేశాల నుంచి వస్తోంది. ఈ సరఫరా హార్ముజ్ జలసంధి మీదుగా రవాణా జరుగుతుంది. కాగా.. ఇరాన్ సంక్షోభం వల్ల ఈ మార్గంలో అంతరాయం ఏర్పడింది. హార్ముజ్ జలసంధిని ఇరాన్​ మూసివేయడంతో అంతర్జాతీయ ఆయిల్ సరఫరాపై ప్రభావం పడనుంది. దీంతో ఆయిల్ సరఫరా భద్రతపై కొంత వరకు ఆందోళన నెలకొంది.

Middle East Oil Crisis | ప్రపంచం మూడో అతిపెద్ద దిగుమతిదారు

ప్రపంచంలో మూడో అతిపెద్ద క్రూడ్ ఆయిల్ దిగుమతిదారుగా భారతదేశం ఉంది. తన క్రూడ్ అవసరాల్లో సగం వరకు హార్ముజ్ జలసంధి మీదుగా దిగుమతి చేసుకుంటోంది. అయితే దేశానికి ప్రధాన ఎల్​ఎన్​జీ సరఫరాదారు ఖతార్ కూడా ఈ మార్గాన్నే వినియోగిస్తుంది. దీంతో ఇంధన రవాణా ప్రభావం పడనుంది.

Middle East Oil Crisis | భారత్ ప్రత్యామ్నాయ వ్యూహాలు

హార్ముజ్ స్ట్రెయిట్ మూసివేతతో భారత్​ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. పశ్చిమ ఆఫ్రికా, లాటిన్ అమెరికా, అమెరికా నుంచి దిగుమతి చేసుకుని లోటును పూడ్చుకునే ఛాన్స్​ ఉంటుంది. అలాగే రష్యా నుంచి కూడా అదనపు ఆయిల్ దిగుమతి చేసుకుని ఇంధన కొరతను అధిగమించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇది కూడా చదవండి..: Strait of Hormuz Closure | హార్ముజ్‌ జలసంధి వద్ద చిక్కుకుపోయిన 700కి పైగా నౌకలు

Iran Israel War | సౌదీ అరేబియాపై ఇరాన్​ బాంబుల వర్షం.. ఇద్దరు దుర్మరణం.. మృతుల్లో ఒకరు భారతీయుడిగా గుర్తింపు!
Lok Sabha Seats Increase | కేంద్రం కీలక నిర్ణయం.. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు
Tirumala VIP Break Darshan | 17న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
BC Reservation Protest | బీసీలను మోసం చేసిన కాంగ్రెస్​.. బీఆర్​ఎస్​ సభ్యుల నిరసన
Watermelon Health Benefits | పుచ్చకాయను ఇష్టంగా తింటారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
TAGGED:Brent Crude OilEnergy SecurityFuel Prices Indiaglobal oil marketHormuz StraitMiddle East conflictOil Imports IndiaPetrol Diesel Rates
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Society Name Forgery Society Name Forgery | ఫోర్జరీ చేసి సొసైటీ పేరును మార్చారు.. సీపీకి మాణిక్ భవన్ కమిటీ ఫిర్యాదు
Next Article Telangana Power Demand Telangana Power Demand | రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్​ డిమాండ్​ : భట్టి విక్రమార్క
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?