Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Electric Scooter Sales | ఎలక్ట్రిక్‌ స్కూటర్ల విక్రయాల్లో టీవీఎస్‌ టాప్‌.. టాప్ -5 నుంచి ఓలా అవుట్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Electric Scooter Sales | ఎలక్ట్రిక్‌ స్కూటర్ల విక్రయాల్లో టీవీఎస్‌ టాప్‌.. టాప్ -5 నుంచి ఓలా అవుట్

బిజినెస్​

Electric Scooter Sales | ఎలక్ట్రిక్‌ స్కూటర్ల విక్రయాల్లో టీవీఎస్‌ టాప్‌.. టాప్ -5 నుంచి ఓలా అవుట్

విద్యుత్‌ స్కూటర్లకు రోజురోజుకు డిమాండ్‌ పెరిగిపోతోంది. అయితే సంప్రదాయ ద్విచక్ర వాహన కంపెనీలే ఈవీ మార్కెట్‌లో లీడర్లుగా నిలుస్తున్నాయి.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 3, 2026 7:09 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
3 వారాలు ago
Share
Electric Scooter Sales

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Electric Scooter Sales | దేశంలో ఎలక్ట్రిక్‌ స్కూటర్ల మార్కెట్‌ విస్తరిస్తోంది. ప్రతినెలా వాహనాల విక్రయాలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు చిన్నచిన్న కంపెనీలదే ఆధిపత్యం కాగా.. సంప్రదాయ ద్విచక్ర వాహన కంపెనీల రంగ ప్రవేశంతో పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం టీవీఎస్‌, బజాజ్‌, హీరో వంటి కంపెనీలు టాప్‌ ఫైవ్‌లో ఉన్నాయి.

Contents
  • Electric Scooter Sales | ఫిబ్రవరి సేల్స్‌ డాటా..
    • Electric Scooter Sales | 364 శాతం వృద్ధి..
      • Electric Scooter Sales | ఆరో స్థానానికి పడిపోయిన ఓలా..

Electric Scooter Sales | ఫిబ్రవరి సేల్స్‌ డాటా..

ఫిబ్రవరి నెలలో మొత్తం 1,11,680 యూనిట్ల ఎలక్ట్రిక్‌ స్కూటర్లు అమ్ముడయ్యాయి. ఇది గతేడాది ఇదే నెలతో పోలిస్తే 46 శాతం అధికం. ఇందులో ప్రముఖ విద్యుత్‌ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ మోటర్స్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఆ కంపెనీ ఫిబ్రవరిలో 31,600 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 67 శాతం వృద్ధిని నమోదు చేసింది. బజాజ్‌ చెతక్‌ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ సంస్థ 25,323 యూనిట్లను విక్రయించింది. చేతక్‌ విక్రయాలు గతేడాదితో పోలిస్తే 17 శాతం పెరిగాయి. ప్రముఖ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ మూడో స్థానాన్ని ఆక్రమించింది. ఈ కంపెనీ గతనెలలో 20,581 స్కూటర్లను అమ్మింది. గతేడాదితో పోలిస్తే 72 శాతం వృద్ధిని నమోదు చేసింది.

Electric Scooter Sales | 364 శాతం వృద్ధి..

హీరో మోటోకార్ప్‌ ఫిబ్రవరిలో 12,512 యూనిట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఈ కంపెనీ గతేడాదితో పోలిస్తే 364 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. 4,725 యూనిట్లతో గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్ అనుబంధ సంస్థ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఐదో స్థానంలో ఉంది. ఈ కంపెనీ యాంపియర్‌ పేరిట ఎలక్ట్రిక్‌ స్కూటీలను విక్రయిస్తోంది. గతేడాదితో పోలిస్తే 27 శాతం వృద్ధిని కనబరిచిన ఈ కంపెనీ మొదటిసారి టాప్‌ ఫైవ్‌లో చోటు దక్కించుకుంది.

Electric Scooter Sales | ఆరో స్థానానికి పడిపోయిన ఓలా..

ఒకప్పుడు దేశీయ ఈవీ మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్‌ సంస్థ మార్కెట్‌ షేర్‌ను ప్రతినెలా కోల్పోతోంది. ఈసారి ఏకంగా టాప్‌ -5 కంపెనీల జాబితానుంచి బయటికి వచ్చింది. ఫిబ్రవరిలో 3,968 యూనిట్లు మాత్రమే అమ్మి ఆరో స్థానంలో నిలిచింది. జనవరి నెలతో పోల్చితే వాల్యూమ్స్‌ 47 శాతం తగ్గింది. 2024లో దేశీయ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల మార్కెట్‌లో 35 శాతంగా ఉన్న ఓలా వాటా.. గతనెలలో 3.55 శాతానికి పడిపోవడం గమనార్హం. ఈవీ స్కూటర్ల విక్రయాలలో ఆరో స్థానంలో ఓలా ఉండగా.. బిగాస్, రివర్ మొబిలిటీ, ఇ-స్ప్రింటో, ప్యూర్‌ ఈవీ కంపెనీలు తర్వాతి స్థానాలలో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: IQOO 15R 5G | శక్తిమంతమైన ప్రాసెసర్‌తో ఐక్యూ ఫోన్.. ఆ కార్డులతో రూ. 4 వేల వరకు తగ్గింపు

Crude Oil Effect | క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం
Mutual Fund Industry | మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ సరికొత్త రికార్డు.. ఫిబ్రవరిలో రూ. 82 లక్షల కోట్లకు చేరిన ఆస్తులు
Motorola Edge 70 Fusion | మోటోరోలానుంచి మరో ఫోన్.. 6న లాంచ్ చేయనున్న కంపెనీ
Stock Market Volatility | వీడని యుద్ధ భయాలు.. లాభనష్టాల మధ్య ఊగిసలాటలో మార్కెట్లు
MARCH 06 Gold Silver Prices | బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల.. ప్రధాన నగరాల్లో నేటి పరిస్థితి ఏమిటంటే..
TAGGED:Ampere ElectricAther EnergyBajaj ChetakElectric Scooter Sales IndiaEV Market IndiaHero MotoCorp EVOla ElectricTVS Motor Company
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Telangana Power Demand Telangana Power Demand | రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్​ డిమాండ్​ : భట్టి విక్రమార్క
Next Article West Asia Tensions West Asia Tensions | పశ్చిమాసియాలో ఉద్రిక్తత.. గల్ఫ్​ దేశాధినేతలతో మాట్లాడిన ప్రధాని
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?