అక్షరటుడే, వెబ్‌డెస్క్: US Israel Iran Conflict | అమెరికా–ఇజ్రాయెల్ దాడులు జరిగిన నాలుగో రోజు కూడా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రంగా కొనసాగుతున్నాయి. United States – Israel సంయుక్తంగా చేపట్టిన దాడులకు ప్రతిగా Iran తీవ్ర స్థాయిలో ప్రతిదాడులు కొనసాగిస్తోంది. కీలక ఇరాన్ సముద్ర మార్గమైన హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రాంతీయ భద్రతపై మరింత ఆందోళన నెలకొంది.
US Israel Iran Conflict | దెబ్బతిన్న చారిత్రాత్మక కట్టడాలు..
టెహ్రాన్‌లోని పలు ప్రభుత్వ, చారిత్రక కట్టడాలు దాడులకు గురయ్యాయి. ప్రభుత్వ ప్రసార సంస్థ Islamic Republic of Iran Broadcasting (IRIB) కార్యాలయం తీవ్రంగానే దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. దీనికితోడు యునెస్కో వారసత్వ జాబితాలో గుర్తింపు పొందిన Golestan Palace దెబ్బతిన్నట్లు సమాచారం.
ఇరాన్ స్థానిక మీడియా కథనం ప్రకారం.. అమెరికా – ఇజ్రాయెల్ దాడి వల్ల ఇరాన్‌లో ఇరాన్ సుప్రీం లీడర్ Ali Khamenei సహా మరణించిన వారి సంఖ్య 787 కు చేరుకుంది. దక్షిణ ఇరాన్‌లో ఒక బాలికల పాఠశాలపై జరిగిన దాడిలో సుమారు 165 మంది మరణించినట్లు స్థానిక మీడియా కథనం.
అమెరికా లక్ష్యాలు నెరవేరేవరకు చర్యలు కొనసాగుతాయని అధ్యక్షుడు Donald Trump స్పష్టం చేశారు. “ఇంకా తీవ్రమైన కఠిన దాడులు ముందున్నాయి” అని అమెరికా విదేశాంగ మంత్రి Marco Rubio హెచ్చరించారు. రక్షణ మంత్రి Pete Hegseth ఈ దాడులు ఇరాన్ నౌకాదళాన్ని బలహీనపర్చడం, అణు–క్షిపణి సామర్థ్యాన్ని అరికట్టడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
US Israel Iran Conflict | గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తత
Qatarలో ఇరాన్ డ్రోన్లు, క్షిపణులను అడ్డుకున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. కానీ, రెండు క్షిపణులు అల్ ఉడైద్ ఎయిర్ బేస్‌ను తాకినట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ ఉత్పత్తిదారుగా పేరు పొందిన QatarEnergy తాత్కాలికంగా తన ఉత్పత్తిని నిలిపివేసింది.
Kuwaitలో మూడు యూఎస్ యుద్ధవిమానాలు కూలిపోయాయి. Saudi Arabia రాజధాని రియాద్ సమీపంలో డ్రోన్లను అడ్డుకున్నట్లు స్థానిక సర్కారు వెల్లడించింది. అమెరికా దౌత్య కార్యాలయాలపైనా దాడులు జరిగాయి.
United Arab Emiratesలోని Dubai International Airport నుంచి పరిమిత సంఖ్యలో విమానాలు తిరిగి ప్రారంభమైనట్లు స్థానిక అధికారులు తెలిపారు. మధ్య ప్రాచ్యంలో ప్రాంతీయ హింస పెరుగుతున్నందున అమెరికా పౌరులు గల్ఫ్ దేశాలను విడిచి స్వదేశానికి చేరుకోవాలని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
US Israel Iran Conflict | ఇజ్రాయెల్‌లో రక్షణ చర్యలు
ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులను Israel వైమానిక రక్షణ వ్యవస్థలు గట్టిగానే అడ్డుకుంటున్నాయి. లెబనాన్ వైపు నుంచి వచ్చిన 2 డ్రోన్లను కూల్చివేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది.
ఇరాన్ అణు కేంద్రాలపై దాడులను సమర్థిస్తూ ఇజ్రాయెల్ ప్రధాని Benjamin Netanyahu.. “ఇది త్వరిత, నిర్ణయాత్మక చర్య”గా వర్ణించారు.

