అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad Land Allotment | హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అత్యంత విలువైన భూమి కేటాయింపుపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది. కేఫ్ బహార్ సమీపంలోని సర్కారు భూమిని కాంగ్రెస్ ఎంపీ Mallu Ravi భార్య మల్లు రాజా బన్సి దేవికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ ఘటన వివాదాస్పదంగా మారింది. ఈ భూమి విలువ దాదాపు రూ.8 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

Hyderabad Land Allotment 233 గజాల స్థలం
Greater Hyderabad Municipal Corporation (జీహెచ్‌ఎంసీ) స్టాండింగ్ కమిటీ తీర్మానం నంబర్ 253 (29.01.2026) ప్రకారం.. హైదరగూడలో ఉన్న కేఫ్ బహార్ సమీపంలో 233.73 చదరపు గజాల సర్కారు భూమిని మల్లు రాజా బన్సి దేవి పేరున కేటాయించేందుకు “నో అబ్జెక్షన్” ఇచ్చినట్లు పత్రాల్లో ఉంది. జిల్లా పరిపాలన సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తీర్మానంలో వెల్లడించారు.
Hyderabad Land Allotment రాజకీయ సంబంధాలపై చర్చ
మల్లు రాజా బన్సి దేవి, కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి సతీమణి. దీంతోపాటు రాష్ట్ర డిప్యూటీ సీఎం Bhatti Vikramarka కుటుంబానికి బంధువు. దీంతో ఈ కేటాయింపుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ నాయకుల కుటుంబాలకు సర్కారు భూములు కేటాయించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు.
Hyderabad Land Allotment ప్రభుత్వ వివరణ ఇలా..
జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ తీర్మానం ప్రకారం.. 2012 నాటి జీఓ ఎం.ఎస్. నంబరు.571 (Revenue – ASSN.I) ప్రకారం జిల్లా పరిపాలన అవసరాల మేరకు ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ సిఫారసు చేసినట్లు సర్కారు చెబుతోంది. కమిటీ ఆమోదంతో కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు పత్రాల్లో వెల్లడించారు.
ప్రతిపక్ష విమర్శలు
తాజా సర్కారు నిర్ణయాన్ని ప్రతిపక్ష నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. గ్రేటర్ నగరం నడిబొడ్డున ఉన్న ఎంతో విలువైన భూమిని రాజకీయ ప్రభావంతో కేటాయించారంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. పారదర్శకత కోసం పూర్తి వివరాలను బహిర్గతం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.

