Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Palamaneru Road Accident | పలమనేరు బైపాస్‌లో ఘోర ప్రమాదం.. లారీని ఢీకొట్టిన కారు.. ఐదుగురు దుర్మరణం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆంధ్రప్రదేశ్​ - Palamaneru Road Accident | పలమనేరు బైపాస్‌లో ఘోర ప్రమాదం.. లారీని ఢీకొట్టిన కారు.. ఐదుగురు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్​

Palamaneru Road Accident | పలమనేరు బైపాస్‌లో ఘోర ప్రమాదం.. లారీని ఢీకొట్టిన కారు.. ఐదుగురు దుర్మరణం

చిత్తూరు జిల్లా పలమనేరు బైపాస్ వద్ద లారీని, వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

Srinivas kolluri
Last updated: మార్చి 4, 2026 12:49 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Palamaneru road accident
Palamaneru road accident

అక్షరటుడే, వెబ్​డెస్క్ :  Palamaneru Road Accident | చిత్తూరు జిల్లా (Chittoor District) పలమనేరు బైపాస్‌లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందుగా వెళ్తున్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Contents
  • Palamaneru Road Accident | అధిక వేగ‌మే కార‌ణ‌మా?
    • Palamaneru Road Accident | వైఎస్ఆర్ జంక్షన్ సమీపంలో..

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. మృతులు కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరుకు చెందిన వారిగా గుర్తించారు. వారు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమల (Tirumala)కు బయలుదేరినట్లు తెలుస్తోంది. ప్రయాణ మధ్యలో పలమనేరు బైపాస్ వద్ద ఈ ప్రమాదం సంభవించింది.

Palamaneru Road Accident | అధిక వేగ‌మే కార‌ణ‌మా?

కారు అధిక వేగంతో లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో వాహనం పూర్తిగా దెబ్బతింది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతదేహాలు వాహనంలో ఇరుక్కుపోవడంతో వాటిని బయటకు తీయడానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గంటలపాటు శ్రమించారు. ప్రమాద సమాచారం అందుకున్న పలమనేరు పోలీసులు (Palamaneru Police) వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణం అధిక వేగమా, లేక డ్రైవర్ నిర్లక్ష్యమా అన్న దానిపై విచారణ చేస్తున్నారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

Palamaneru Road Accident | వైఎస్ఆర్ జంక్షన్ సమీపంలో..

చిత్తూరు జిల్లా గంగవరం మండలం వైఎస్ఆర్ జంక్షన్ సమీపంలో జరిగిన ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Mandipalli Ramprasad Reddy) ఆరా తీశారు. ప్రమాద వివరాలను అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు ఉన్నట్లయితే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను కోరారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ విషాద ఘటనతో మృతుల కుటుంబాల్లోనే కాకుండా బెంగళూరు ప్రాంతంలోనూ తీవ్ర శోకం నెలకొంది. తిరుమల దర్శనానికి బయలుదేరిన కుటుంబం ఇలా దుర్ఘటనకు గురవడం స్థానికులను కలిచివేసింది. పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Tirumala Devotee Rush | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ కంపార్టుమెంట్లు ఫుల్​..

Markapur Bus Accident Hero | అంద‌రిని క‌లిచి వేసిన మార్కాపురం బస్సు ప్రమాదం.. 8మందిని కాపాడిన రియ‌ల్ హీరో బాలరాజు
Amaravati Fire Accident | అమ‌రావ‌తిలో మ‌రో అగ్ని ప్ర‌మాదం.. వరుస ఘటనలతో కుట్ర కోణంపై అనుమానాలు
Eluru Child Tragedy | ఏలూరులో చోటు చేసుకున్న తీవ్ర విషాదం.. కూల్‌డ్రింక్ అనుకొని పురుగుల మందు తాగి చిన్నారి మృతి
Vijayawada Temple Theft | విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో భారీ చోరీ.. భక్తురాలి బ్యాగ్ నుంచి రూ.50 లక్షల బంగారం మాయం!
Alipiri Walkers Protest | అలిపిరి మార్గంలో వాకర్ల ఆందోళన.. నగరవనం ప్రవేశ రుసుముపై రాస్తారోకో, ట్రాఫిక్ జామ్
TAGGED:Andhra Pradesh road crashAP highway accidentBengaluru family accidentChittoor accident newsChittoor DistrictFive killed in accidentMandipalli Ramprasad ReddyPalamaneru road accidentRoad safety newsTirumalaTirumala route accident
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Amanagallu Incident Amanagallu Incident | అగ్నిగుండంలో పడిపోయిన భక్తులు.. పలువురికి తీవ్రగాయాలు
Next Article Mojtaba Khamenei Iran Mojtaba Khamenei Iran | ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?