Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Nitish Kumar | బీహార్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ .. రాజీనామా చేయనున్న సీఎం నితీశ్​?
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Nitish Kumar | బీహార్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ .. రాజీనామా చేయనున్న సీఎం నితీశ్​?

జాతీయం

Nitish Kumar | బీహార్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ .. రాజీనామా చేయనున్న సీఎం నితీశ్​?

బీహార్​ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. సీఎం నితీశ్​కుమార్​ రాజీనామా చేయనున్నట్లు సమాచారం.

Srinivas kolluri
Last updated: మార్చి 4, 2026 6:53 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Nitish Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nitish Kumar | బీహార్​ (Bihar) రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. సీఎం నితీశ్​కుమార్​ రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఆయన రాజ్యసభకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Contents
  • Nitish Kumar | మార్చి 16న రాజీనామా
    • Nitish Kumar | సీఎంతో పలువురు భేటీ

ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లడానికి అంతా సిద్ధం అయినట్లు సమాచారం. అయితే తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే చర్చ మొదలైంది. నితీశ్​ రాజ్యసభ స్థానానికి నామినేషన్ వేయడానికి సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయని జనతాదళ్ యునైటెడ్ (JDU) వర్గాలు తెలిపాయి. నామినేషన్ పత్రాలు సిద్ధం అయ్యాయని పేర్కొన్నారు. మార్చి 5న ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Nitish Kumar | మార్చి 16న రాజీనామా

నితీశ్​కుమార్​కు ఈ నెల 1న 75 ఏళ్లు నిండాయి. ఆయన ఈ నెల 16 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఆ రోజు జరగనున్న రాజ్యసభ ఎన్నికలు వరకు కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి. ఆయన ఎగువ సభకు వెళ్తే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి.

bihar cm

Nitish Kumar | సీఎంతో పలువురు భేటీ

సీఎం రాజీనామా ప్రచారం నేపథ్యంలో జేడీయూ నాయకులు సమావేశం అవుతున్నారు. మంత్రి విజేంద్ర ప్రసాద్ యాదవ్ కుమార్‌, మంత్రి అశోక్ చౌదరి సీఎంను కలిశారు. నితీశ్​కుమార్​ రాజ్యసభకు వెళ్తే.. బీజేపీ (BJP) సీఎం పదవి చేపట్టే అవకాశం ఉంది. నితీశ్​ కుమార్ కుమారుడు నిషాంత్ కుమార్ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారు. ఇన్ని రోజులుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయనను డిప్యూటీ సీఎం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దీనిని కూడా చదవండి : BJP Rajya Sabha Candidates | రాజ్యసభ ఎన్నికలకు 9 మంది బీజేపీ అభ్యర్థుల ప్రకటన.. బీహార్ నుంచి బరిలో నితిన్ నబిన్..

Indians Killed in Iran Attacks | ఇరాన్‌ దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి
West Asia Tensions | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై మంత్రి జైశంకర్​ ప్రకటన
Rupee All Time Low | భారీగా రూపాయి పతనం.. ఆల్‌టైం కనిష్ఠానికి చేరిన మారకం విలువ
Nishant Kumar JDU | రాజకీయాల్లోకి బీహార్ సీఎం నితీశ్ కుమారుడు ఎంట్రీ.. జేడీయూలో చేరిన నిశాంత్ కుమార్..
Shivalik Gas Tanker | తీరనున్న గ్యాస్​ కష్టాలు.. నేడు గుజరాత్ తీరానికి శివాలిక్​ నౌక
TAGGED:Bihar CM newsBihar politicsBJP BiharJDU partyNitish KumarNitish Kumar resignationRajya Sabha election
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Eye Camp to Drivers Eye Camp to Drivers | డ్రైవర్లకు కంటి చూపు చాలా ముఖ్యం : ఎస్పీ రాజేష్ చంద్ర
Next Article Adulterated Ghee Adulterated Ghee | డాల్డాతో నెయ్యి తయారీ.. తిన్నారంటే అంతే!
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?