అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Municipal Chairperson | సేవ చేయాలని సంకల్పం ఉన్న దాతలు సమాజ సేవలో ముందుండాలని కామారెడ్డి మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి అన్నారు. కామారెడ్డి మండలంలోని భవానీపేట్ శివారులో గల చిల్డ్రన్ హోంలో బుధవారం చిన్నారులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, డిక్షనరీలు, పండ్లు పంపిణీ చేశారు.
Kamareddy Municipal Chairperson |నోటుబుక్కుల పంపిణీ
ఈ సందర్భంగా ఛైర్పర్సన్ మాట్లాడుతూ.. పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి శుభాకాంక్షలు చెబుతూ కలవడానికి వచ్చే వాళ్లకి షాలువాలు, పూల బొకేలకి బదులుగా నోట్ బుక్స్, పెన్స్ ఇతర అవసరమైనా వస్తువులను ఇవ్వాలని చెప్పడం జరిగిందన్నారు. సహృదయంతో స్పందించిన వారు నోట్ బుక్స్, డిక్షనరీలు ఇవ్వడం ఇవ్వడం జరిగిందని వివరించారు. వాటిని దగ్గరలో ఉన్న ఆశ్రమ చిన్నారులకు పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో చిల్డ్రన్స్ హోం నిర్వాహకులు శోభన్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు, బంగారు దేవదాసు, ఇటుకల శ్రీనివాస్, అక్షయ్, ప్రేమ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Yellareddy RDO Prabhakar | ఎల్లారెడ్డి ఆర్డీవోగా ప్రభాకర్ బాధ్యతల స్వీకరణ

