అక్షరటుడే, న్యూఢిల్లీ: Global Stock Markets | అమెరికా, ఇరాన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ముగించడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారంతో మార్కెట్లు కుదుటపడుతున్నాయి. గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్(Wallstreet)తోపాటు యూరోపియన్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. గురువారం ఉదయం ఆసియా మార్కెట్లు సైతం గ్రీన్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు సైతం లాభాలతో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Global Stock Markets | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్‌లో నాస్‌డాక్(Nasdaq) 1.33 శాతం, ఎస్ అండ్ పీ 0.78 శాతం లాభపడ్డాయి. గురువారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.23 శాతం నష్టంతో ఉంది.
Global Stock Markets | యూరోప్ మార్కెట్లు..
డీఏఎక్స్ 1.71 శాతం, ఎఫ్టీఎస్ఈ 0.79 శాతం, సీఏసీ 0.78 శాతం పెరిగాయి.
Global Stock Markets | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు భారీ నష్టాలతో ఉన్నాయి. ఉదయం 7.45 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 10.19 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 2.87 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 2.93 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.59 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.55 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.43 శాతం లాభంతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.28 శాతం లాభంతో ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు భారీ గ్యాప్ అప్‌లో ప్రారంభం కానున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 8,752 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డీఐఐలు నికరంగా రూ. 12,068 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 0.99 నుంచి 0.94కి పడిపోయింది.
- విక్స్(VIX) 23.41 శాతం పెరిగి 21.14 కి చేరింది. ఇది గతేడాది మే 9 నాటి గరిష్టం.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 67 పైసలు బలహీనపడి 92.15 వద్ద ఉంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 2.01 శాతం పెరిగి బ్యారెల్‌కు 83.34 డాలర్లకు చేరింది.
- సెన్సెక్స్ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్‌లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.

