అక్షరటుడే, వెబ్‌డెస్క్: Finn Allen 33 Ball Century | కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens) స్టేడియంలో జరిగిన టీ20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్ మ్యాచ్ ప్రేక్షకులకు అసలు ఉత్కంఠ లేకుండా ముగిసింది. సెమీస్ వరకు ఓటమి లేకుండా దూసుకొచ్చిన సౌతాఫ్రికా జట్టు ఈ కీలక పోరులో చిత్తుగా ఓడిపోయింది.
మరోవైపు న్యూజిలాండ్ టీం (New Zealand Team) అసాధారణ బ్యాటింగ్‌తో ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది.ముందుగా కివీస్ కెప్టెన్ సాంట్నర్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆ నిర్ణయం ఫలించింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 169 పరుగులు చేసింది. ఒక దశలో 5 వికెట్లకు 77 పరుగులతో కష్టాల్లో పడిన ఆఫ్రికన్ జట్టును యాన్సెన్ ఆదుకున్నాడు. అతను కేవలం 30 బంతుల్లో అజేయంగా 55 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు.
Finn Allen 33 Ball Century | కివీస్ బౌలర్ల అదిరే ప్రదర్శన
ట్రిస్టన్ స్టబ్స్ (29)తో కలిసి ఆరో వికెట్‌కు 48 బంతుల్లో 73 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, కోల్ మెక్‌కాంచీ, రచిన్ రవీంద్ర తలా రెండు వికెట్లు తీసి సౌతాఫ్రికాను కట్టడి చేశారు.ఇక 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్ ఫిన్ అలెన్ (Finn Allen) విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు. అతను 8 సిక్స్‌లు, 10 ఫోర్ల సాయంతో కేవలం 303 స్ట్రైక్‌రేట్‌తో 100 పరుగులు చేసి సెంచరీ సాధించాడు. మరోవైపు టిమ్ షెపర్డ్ 58 పరుగులతో చక్కటి మద్దతు ఇచ్చాడు. రచిన్ రవీంద్రన 13 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
Finn Allen 33 Ball Century | న్యూజిలాండ్ జట్టు ఫైనల్‌కు
న్యూజిలాండ్ జట్టు కేవలం 12.5 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ విజయం కివీస్ శక్తిని చాటిచెప్పింది. సెమీస్ వరకు అజేయంగా సాగిన సౌతాఫ్రికాకు ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోవడం పెద్ద దెబ్బగా మారింది. బ్యాటింగ్‌లో తడబాటు, బౌలింగ్‌లో దారుణ వైఫల్యం జట్టును కుంగదీసింది. ఒక్క రబాడ మాత్రమే వికెట్ సాధించగలిగాడు. మిగతా బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఈ భారీ విజయంతో న్యూజిలాండ్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్లో కివీస్ ఎవరిని ఎదుర్కొంటుందో చూడాలి. అయితే సౌతాఫ్రికా ఈ ఓటమితో మరోసారి చోకర్స్‌గా మారారు.
ఇది కూడా చదవండి..: T20 World Cup 2026 | టీ20 ప్రపంచకప్ 2026పై యుద్ధ ప్రభావం.. జట్ల భద్రతపై ఐసీసీ అప్రమత్తం

