అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad Timber Depot Fire | హైదరాబాద్ నగరంలో మరో అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. వరుస ఫైర్ యాక్సిడెంట్లు ప్రజలను కలవర పెడుతున్నాయి. మంగళవారం రాత్రి బాచుపల్లిలో జరిగిన ప్రమాదంలో రూ.5 కోట్ల ఆస్తి నష్టం జరిగిన విషయం తెలిసిందే. తాజగా మైలార్‌దేవ్‌పల్లిలో టింబర్ డిపోలో మంటలు అంటుకుంటున్నారు.
నగరంలోని మైలార్‌దేవపల్లి-కాటేదాన్ (Mailardevapalli-Katedan) ప్రాంతంలోని సుమిత్ టింబర్ డిపో, బీడీ ప్లైవుడ్ గోడౌన్‌లో మంటలు వ్యాపించాయి. టింబర్ డిపోలో ఉన్న దుంగలు, కట్టెలకు మంటలు అంటుకుని తగలబడటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టింబర్ డిపో కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
Hyderabad Timber Depot Fire | రూ.కోటి ఆస్తి నష్టం
టింబర్ డిపో (Sumit Timber Depot) కాలిబూడిద అవడంతో రూ.కోటి వరకు ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి వచ్చారు. రెండు ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad Timber Depot Fire | భయం భయంగా..
హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఇటీవల అగ్ని ప్రమాదాలు భారీగా చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రజలు భయం భయంగా గడుపుతున్నారు. అసలే వేసవి కాలం కావడంతో క్షణాల్లో మంటలు వ్యాపిస్తున్నాయి. మంగళవారం రాత్రి బాచుపల్లి దాదాపు 50 ఫర్నిచర్ దుకాణాలు కాలిపోయాయి. అంతకు ముందు జూబ్లీహిల్స్‌లోని ఓ మాల్లో మంటలు అంటుకున్నాయి. గతంలో ఓ కారు షో రూమ్, బైక్ షోరూమ్‌లో సైతం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నాంపల్లిలోని బచ్చాస్ ఫర్నిచర్ దుకాణంలో జనవరిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా.. ఐదుగురు చనిపోయారు.
Hyderabad Timber Depot Fire | చర్యలు కరువు
నాంపల్లిలోని బచ్చాస్ ఫర్నిచర్ దుకాణంలో ప్రమాదం అనంతరం హైడ్రాతో పాటు ఇతర శాఖల అధికారులు హడావుడి చేశారు. పలు వాణిజ్య భవనాలు, దుకాణాలు, మాల్స్‌లలో తనిఖీలు చేపట్టారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని వాటిని సీజ్ చేశారు. ముచ్చటగా మూడు రోజులు తనిఖీలు చేసిన అధికారులు.. వ్యాపారుల వినతి మేరకు నెల రోజులు విరామం ఇస్తున్నట్లు ప్రకటించారు. అప్పటిలోగా ఆయా భవనాల్లో అగ్ని ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని సూచించారు. అయితే ఆ నెల రోజుల గడువు ముగిసినా అధికారులు మళ్లీ తనిఖీలు ప్రారంభించలేదు. మరోవైపు నగరంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఫైర్ యాక్సిడెంట్లు అవుతున్నాయి.
ఇది కూడా చదవండి..: Bachupally Fire Accident | బాచుపల్లిలో భారీ అగ్ని ప్రమాదం

