Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Nitish Kumar Resigns | బీహార్​లో కీలక పరిణామం.. రాజీనామా చేయనున్న నితీశ్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Nitish Kumar Resigns | బీహార్​లో కీలక పరిణామం.. రాజీనామా చేయనున్న నితీశ్

జాతీయం

Nitish Kumar Resigns | బీహార్​లో కీలక పరిణామం.. రాజీనామా చేయనున్న నితీశ్

బీహార్​ సీఎం నితీశ్​కుమార్​ రాజీనామా చేయనున్నారు. తాను రాజ్యసభకు వెళ్తున్నట్లు ఆయన ప్రకటించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 5, 2026 11:52 ఉద.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Nitish Kumar Resigns
Nitish Kumar Resigns

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nitish Kumar Resigns | బీహార్​ రాజకీయాల్లో (Bihar Politics) కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు దశాబ్దాలకు పైగా ముఖ్యమంత్రిగా సేవలందించిన నితీశ్​కుమార్​ రాజీనామా చేయనున్నారు. ఆయనను రాజ్యసభకు వెళ్తున్నారు. ఈ మేరకు నితీశ్​ ఎక్స్​ వేదికగా ప్రకటించారు.

Contents
  •  Nitish Kumar Resigns | నాలుగు సభల్లో..
    •  Nitish Kumar Resigns | కొత్త సీఎం ఎవరు

ఇటీవల జరిగిన బీహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Elections) అధికార ఎన్​డీఏ కూటమి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. బీజేపీ 89, జేడీయూ 85 స్థానాల్లో విజయం సాధించాయి. బీజేపీ (BJP) ఎక్కువ సీట్లు సాధించిన ముందు చెప్పినట్లుగానే నితీశ్​కుమర్​కు సీఎం పగ్గాలు అప్పగించింది. అయితే తాజాగా రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో బీహార్​ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. నితీశ్​కుమార్​ పెద్దల సభకు వెళ్లనున్నారు. ప్రజల మద్దతుతో బిహార్‌కు రెండు దశాబ్దాలుగా సేవ చేసినట్లు ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో కూడా ప్రజల్లోనే ఉంటానని, బీహార్‌కు త్వరలో కొత్త సీఎం వస్తారని ఆయన ఎక్స్​లో ప్రకటించారు.

 Nitish Kumar Resigns | నాలుగు సభల్లో..

నితీశ్​కుమార్​ (Nitish Kumar) గతంలో ఎంపీగా పని చేశారు. అనంతరం ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా కొనసాగారు. ప్రస్తుతం రాజ్యసభకు వెళ్లనున్నారు. దీంతో నాలుగు చట్ట సభల్లో సభ్యుడిగా ఉన్న వ్యక్తిగా ఆయన నిలవనున్నారు. రెండు దశాబ్దాలుగా బీహార్​ ప్రజలు తనను విశ్వసించారని, మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. తాను అంకితభావంతో సేవ చేశానని తెలిపారు. కాగా నితీశ్​కుమార్ రాజ్యసభ ఎన్నికలకు ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా ఆయన రాజీనామా చేస్తారని తెలియడంతో జేడీయూ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఆయనే సీఎంగా కొనసాగాలని కోరుతున్నారు.

 Nitish Kumar Resigns | కొత్త సీఎం ఎవరు

నితీశ్​కుమార్​ రాజ్యసభకు వెళ్తుండటంతో బీహార్​ సీఎం (Bihar CM) ఎవరు అవుతారనే ఉత్కంఠ నెలకొంది. బీజేపీ నుంచి సీఎం అవుతారా.. మళ్లీ జేడీయూకే అవకాశం ఇస్తారా అనేది ఒకటి రెండు రోజుల్లో తేలనుంది. పలువురి పేర్లు సీఎం రేసులో ఉన్నాయి. సామ్రాట్ చౌదరి (Samrat Chaudhary) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన బీజేపీకి చెందిన వారు. ప్రస్తుతం ఆర్థికం, ఆరోగ్యం, పట్టణాభివృద్ధి ,హోం వ్యవహారాలు వంటి కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్నారు. జనవరి 2024లో నితీష్ కుమార్ ప్రభుత్వంలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా సైతం పని చేశారు. సామ్రాట్ చౌదరి రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి శకుని చౌదరి ఏడుసార్లు ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేశారు.

ఇది కూడా చదవండి..: Nitish Kumar | బీహార్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ .. రాజీనామా చేయనున్న సీఎం నితీశ్​?

One Rupee Shoes Offer | రూపాయికే బూట్లని ప్రచారం.. ప్రజలు పోటెత్తడంతో లాఠీఛార్జీ
Lockdown Rumors | లాక్ డౌన్ దిశగా అడుగులు.. స్పష్టత ఇచ్చిన కేంద్రం
IRCTC Pilgrimage Tour | ఐఆర్‌సీటీసీ స్పెషల్‌ టూర్‌ ప్యాకేజీ.. పుణ్యక్షేత్రాల సందర్శనకు భారత్‌ గౌరవ్‌ రైలు
India LPG Supply Restrictions | కేంద్రం కీలక నిర్ణయం.. ఎల్​పీజీ సరఫరాపై దేశవ్యాప్తంగా ఆంక్షలు
Allahabad High Court | మరో మహిళతో సహజీవనం నేరం కాదు.. హైకోర్టు సంచలన తీర్పు
TAGGED:Bihar Assembly ElectionsBihar CMBihar politicsBJPNitish KumarNitish Kumar ResignsSamrat Chaudhary
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Bhadrachalam Kalyana Talambralu | Bhadrachalam Kalyana Talambralu | భక్తుల ఇంటికే భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాలు..
Next Article Nagpur Incident Nagpur Incident | హోలీ రోజు షాకింగ్ ఘటన.. మనవడిపై మరుగుతున్న నీళ్లు కుమ్మరించిన బామ్మ
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?