అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nagpur Incident | రంగుల పండుగ హోలీ సందర్భంగా మహారాష్ట్ర (Maharashtra)లోని నాగ్‌పూర్‌లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. తనపై రంగులు చల్లాడని కోపంతో ఓ బామ్మ నాలుగేళ్ల మనవడిపై మరుగుతున్న వేడి నీళ్లను కుమ్మరించింది. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
వివరాలలోకి వెళితే నాగ్‌పూర్‌లోని కోరాడి ప్రాంతంలో హోలీ పండుగ (Holi Festival) సందర్భంగా పిల్లలు వీధిలో రంగులతో ఆడుకుంటున్నారు. అదే సమయంలో ఒక బామ్మ వేడి నీళ్ల బకెట్ పట్టుకుని వీధి నుంచి ఇంట్లోకి వెళ్తుండగా ఆమె నాలుగేళ్ల మనవడు సరదాగా రంగులు చల్లాడు. ఈ ఘటనతో కోపోద్రిక్తురాలైన బామ్మ, అడ్డుకునే ప్రయత్నంలో తన చేతిలో ఉన్న బకెట్‌లోని వేడి నీళ్లను బాలుడిపై కుమ్మరించింది. దీంతో బాలుడి శరీరంపై తీవ్రంగా కాలిన గాయాలు అయ్యాయి.
Nagpur Incident | బాలుడి అరుపులు… ఆ తర్వాత
వేడి నీళ్లు పడటంతో బాలుడు గట్టిగా అరవడంతో విషయం వెంటనే ఆమెకు అర్థమైంది. దీంతో ఆందోళన చెందిన బామ్మ పక్కనే ఉన్న బకెట్‌లోని చల్లని నీళ్లను తీసుకుని బాలుడిపై పోసింది. అయితే అప్పటికే బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాలుడి అరుపులు విన్న కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని గమనించారు. అనంతరం బాలుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యుల సమాచారం ప్రకారం బాలుడికి శరీరంలోని కొన్ని భాగాల్లో తీవ్రమైన కాలిన గాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

Nagpur Incident | బామ్మపై కేసు నమోదు
ఈ ఘటనపై సమాచారం అందుకున్న కోరాడి పోలీసులు (Koradi Police) వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. బాలుడిపై వేడి నీళ్లు కుమ్మరించిన ఘటనకు సంబంధించి నిందితురాలైన బామ్మపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే బకెట్‌లో వేడి నీళ్లు ఉన్న విషయం ఆమెకు మరిచిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు ముందు ఆమె రోడ్డుపై నీళ్లు చిమ్మడం, బకెట్‌లోని నీటిని రోడ్డుపై పారబోయడం వీడియోలో కనిపిస్తుంది. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చిన్నారుల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. పండుగల సమయంలో పిల్లలు ఆడుకునే సమయంలో పెద్దలు మరింత జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు.
A shocking incident from Nagpur during Holi: An elderly woman allegedly poured hot water on a young boy who was playing. The video is now going viral on social media. pic.twitter.com/Qxv1EA6HNp
— VRF NEWS (@VRFNEWS) March 5, 2026
ఇది కూడా చదవండి..: Nitish Kumar Resigns | బీహార్‌లో కీలక పరిణామం.. రాజీనామా చేయనున్న నితీశ్

