అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Bus Accident | బస్సు దిగుతుండగా అదుపు తప్పి కిందపడి డిప్యూటీ తహశీల్దార్ గాయాలపాలయ్యాడు. ఈ ఘటన కామారెడ్డి పట్టణం (Kamareddy town)లో గురువారం చోటు చేసుకుంది.
Kamareddy Bus Accident | బస్టాండ్‌లో టర్నింగ్ వద్ద..
మద్నూర్ డిప్యూటీ తహశీల్దార్‌గా (Madnur Deputy Tahsildar) విధులు నిర్వర్తిస్తున్న శరత్ కుమార్ కరీంనగర్ నుంచి కామారెడ్డికి ఆర్టీసీ బస్సులో ఉదయం వచ్చారు. బస్టాండ్ లోపలికి బస్సు టర్న్ అవుతుండగా ఆయన కిందికి దిగారు. ఈ క్రమంలో అదుపుతప్పి బస్సు కింద పడ్డారు. దీంతో ఆయన కుడికాలుపై నుంచి టైరు వెళ్లింది. వెంటనే స్థానికులు గమనించి ఆయనను కామారెడ్డి జీజీహెచ్‌కు తరలించారు. వైద్యులు పరిశీలించి కాలు విరిగిందని ధృవీకరించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు.
ఇది కూడా చదవండి..: Bhadrachalam Kalyana Talambralu | భక్తుల ఇంటికే భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాలు..

