Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Inter Exams Malpractice | మాల్​ప్రాక్టీస్​ జరగకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ ఇలాత్రిపాఠి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Inter Exams Malpractice | మాల్​ప్రాక్టీస్​ జరగకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ ఇలాత్రిపాఠి

నిజామాబాద్

Inter Exams Malpractice | మాల్​ప్రాక్టీస్​ జరగకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ ఇలాత్రిపాఠి

ఇంటర్​ పరీక్షల్లో మాల్​ప్రాక్టీస్​ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి అన్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 5, 2026 2:18 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Inter Exams Malpractice
Inter Exams Malpractice

అక్షరటుడే, బోధన్: Inter Exams Malpractice | ఇంటర్​ పరీక్షల్లో మాల్​ప్రాక్టీస్​ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అన్నారు. పట్టణంలోని ఇంటర్​ పరీక్షా కేంద్రాలను ఆమె గురువారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు.

Contents
  • Inter Exams Malpractice | పట్టణంలోని పలు కళాశాలల్లో..
    • Inter Exams Malpractice | గైర్హాజరైన విద్యార్థులు..
      • Inter Exams Malpractice | మాస్​కాపీయింగ్​కు ఆస్కారం లేకుండా..

Inter Exams Malpractice | పట్టణంలోని పలు కళాశాలల్లో..

పట్టణంలోని విజేత జూనియర్ కళాశాల, ఉషోదయ, విద్యా వికాస్ జూనియర్ కాలేజీలలో (Vidya Vikas Junior Colleges) కొనసాగుతున్న పరీక్షా కేంద్రాలను కలెక్టర్​ తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల్లో అందుబాటులో ఉన్న తాగునీరు, టాయిలెట్స్ వంటి సౌకర్యాలను పరిశీలించారు. సీసీ కెమెరా నిఘాలో పరీక్షలు జరుగుతున్నాయా లేదా అని గమనించారు. పలు కేంద్రాల్లో లోపాలను గమనించిన కలెక్టర్ సంబంధిత అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బోధన్ పట్టణంలోని అన్ని పరీక్షా కేంద్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి తనకు వివరాలు తెలియజేయాలని డీఐఈవో రవికుమార్ (DIEO Ravikumar)​ను ఆదేశించారు.

Inter Exams Malpractice | గైర్హాజరైన విద్యార్థులు..

పరీక్షల్లో భాగంగా గురువారం ఫస్టియర్ గణితం-1బీ, జువాలజీ, హిస్టరీ సబ్జెక్టులకు సంబంధించిన పరీక్ష జరగగా, ఆయా కేంద్రాల్లో గైర్హాజరైన విద్యార్థుల సంఖ్య గురించి కలెక్టర్ ఆరా తీశారు. విజేత జూనియర్ కళాశాలలో మొత్తం 441 మందికి గాను 12మంది గైర్హాజరయ్యారని చీఫ్​ సూపరింటెండెంట్​ స్వర్ణలత తెలిపారు. ఉషోదయ కాలేజీలోని సెంటర్​లో 358 మందికి గాను 21 మంది హాజరు కాలేదని చీఫ్ సూపరింటెండెంట్ అనిల్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అలాగే, విద్యావికాస్ జూనియర్ కాలేజీలోని సెంటర్​లో 406 మంది విద్యార్థులకు 398 మంది హాజరయ్యారని కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ రవీందర్ తెలిపారు.

Inter Exams Malpractice
Inter Exams Malpractice

Inter Exams Malpractice | మాస్​కాపీయింగ్​కు ఆస్కారం లేకుండా..

పరీక్షా కేంద్రాల్లోకి ఎవరు కూడా సెల్​ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు తేకుండా, కాపీయింగ్​కు ఆస్కారం లేకుండా విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించాలని కలెక్టర్ సూచించారు. బాలికలను మహిళా సిబ్బంది తనిఖీ చేసే ప్రక్రియకు సహకారం అందించాలని ఏఎన్​ఎంలకు సూచించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో పక్కాగా పరీక్షలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

ఇది కూడా చదవండి..: Bheemgal Tiger Movement | కమ్మర్‌పల్లి అడవుల్లో పులి సంచారం.. అధికారుల అప్రమత్తం

SSC Exam Rules | ఎస్సెస్సీ పరీక్షల్లో నిర్లక్ష్యం చేస్తే.. సస్పెన్షన్​ కంటే కఠినచర్యలు: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
Gandhari Mandal | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల జైలు
Manala Mohan Reddy | తండాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలి : మానాల మోహన్​రెడ్డి
Yellareddy Pond Death | అదృశ్యమైన వ్యక్తి చెరువులో శవమై తేలాడు
Fake Land Documents | ఫేక్ డాక్యుమెంట్లతో కబ్జాకు యత్నం.. ప్రజావాణిలో బాధితుడి ఫిర్యాదు
TAGGED:board exams indiabodhan newscollector inspectioneducation administrationexam malpractice preventioninter exams telanganajunior college examsTelangana Education NewsVidya Vikas Junior Colleges
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Kamareddy Bus Accident Kamareddy Bus Accident | బస్సు ప్రమాదం.. డిప్యూటీ తహశీల్దార్​కు గాయాలు..
Next Article Indiramma Houses Scheme Indiramma Houses Scheme | పథకాలను పక్కాగా అమలుచేయాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?