అక్షరటుడే, ఆర్మూర్: Complaint Against SI | నిజామాబాద్ జిల్లా (Nizamabad District) బాల్కొండ ఎస్సై సైలేందర్‌పై చర్యలు తీసుకోవాలని ఖాజీపురాకు చెందిన ఎం.ఏ. ఇమ్రాన్ ఖాన్ ఆర్మూర్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫయాజ్ ఆధ్వర్యంలో గురువారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు.
Complaint Against SI | ఏసీపీకి వినతి..
మార్చి 2న సాయంత్రం సమయంలో ఖాజీపురా (Khazipura)లోని ఆలంగీర్ మసీదు ప్రాంగణంలో సయీద్ ఫాసి అహ్మద్ (షేరు), షోయబ్ అనే వ్యక్తులు సుమైర్ అనే వ్యక్తిని కొట్టాడని పేర్కొన్నారు. ఆ సమయంలో గొడవను ఆపేందుకు ఇమ్రాన్ ఖాన్ సోదరుడు అబ్దుల్ ఇర్ఫాన్ ఖాన్ జోక్యం చేసుకుని రంజాన్ నెల కావడంతో మసీదు ప్రాంగణంలో గొడవ చేయొద్దని ఇరువర్గాలను కోరాడన్నారు.
అయితే సయీద్ ఫాసి అహ్మద్ పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అబ్దుల్ ఇర్ఫాన్ ఖాన్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని వివరించాడు. అనంతరం సయీద్ ఫాసి అహ్మద్.. సుమైర్, అబ్బూ, అబ్దుల్ ఇర్ఫాన్ ఖాన్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేశాడన్నారు.
దీనిపై బాల్కొండ ఎస్సై సైలేందర్ (Balkonda SI Silendhar) ముగ్గురిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి సరైన విచారణ చేయకుండా ఫైబర్ స్టిక్‌లతో తీవ్రంగా కొట్టారని ఫిర్యాదులో ఆరోపించారు. ఈ ఘటనలో అబ్దుల్ ఇర్ఫాన్ ఖాన్, సుమైర్, అబ్బూ తీవ్ర గాయాలయ్యాయని వివరించారు. అనంతరం వారిని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించినట్లు పేర్కొన్నారు.
Complaint Against SI | సీఐకి ఫిర్యాదు చేసినా..
అయితే ముగ్గురిపై ఎస్సై సైలేందర్ గంజాయి కేసులు పెడతానని బెదిరించారని, దుర్భాషలాడారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై మార్చి 3న బాల్కొండ సీఐ (Balkonda CI)కి కూడా ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి సంబంధిత ఎస్సైపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏసీపీని కోరారు.
ఇది కూడా చదవండి..: Inter Exams Malpractice | మాల్‌ప్రాక్టీస్ జరగకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ ఇలాత్రిపాఠి

